ఛ‌లో.. పాట‌లు మాయ చేస్తున్నాయిగా..


కొన్ని సినిమాల‌పై అంచ‌నాలు పెర‌గ‌డానికి పాట‌లు కూడా దోహ‌దం చేస్తాయి. ఇప్పుడు నాగ‌శౌర్య ఛ‌లో కూడా ఇదే లిస్ట్ లోకి వ‌స్తుంది. ఈ చిత్రం మొద‌లై న‌పుడు ఎవ‌రికీ తెలియ‌దు. ఇలాంటి సినిమా వ‌స్తుంద‌నే విష‌యం కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప‌ట్టించుకోక త‌ప్ప‌ట్లేదు. తాను చేస్తున్న‌ది చిన్న సినిమా ఏదీ కాద‌ని.. తీసిపారేయాల్సిన ప‌నిలేద‌ని నిరూపిస్తున్నాడు శౌర్య‌. ఇందులో ఇప్ప‌టికే విడుద‌లైన చూసి చూడంగానే సాంగ్ అదిరిపోయే హిట్ అయింది. ఇక ఇప్పుడు విడుద‌లైన డ్రంక్ అన్ డ్రైవ్ అనే పాట కూడా మంచి స్పంద‌న తెచ్చుకుంటుంది. మ‌రీ ముఖ్యంగా కెమెరా వ‌ర్క్ అయితే అదిరిపోయిందంతే. ఈ రెండు పాట‌లే సినిమాపై అంచ‌నాలు పెంచేలా క‌నిపిస్తున్నాయి. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌త్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌డం విశేషం. ఛ‌లోతో క‌చ్చితంగా హిట్ కొట్ట‌డ‌మే ధ్యేయంగా దూసుకెళ్తున్నాడు నాగ‌శౌర్య‌. త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల దీనికి ద‌ర్శ‌కుడు. ఇందులో క‌న్న‌డ సంచ‌ల‌నం ర‌ష్మిక మండ‌న్న హీరోయిన్ గా న‌టిస్తుంది. తెలుగు-త‌మిళ‌నాడు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగ‌నుంది. డిసెంబ‌ర్ 29నే రావాల్సిన ఈ చిత్రం భారీ సినిమాల కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 2కి వాయిదా ప‌డిపోయింది. ఛ‌లోతో పాటు సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తున్న క‌ణంలో కూడా హీరోగా న‌టిస్తున్నాడు శౌర్య‌. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. అంటే వారం రోజుల గ్యాప్ లోనే రెండు సినిమాల‌తో రానున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఈ రెండు సినిమాలు శౌర్యను ఏం చేయ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here