జులై.. ఇది కుర్రాళ్ల స‌మ‌రం..!


జులైలో కుర్రాళ్ళంతా ఒకేసారి కుమ్మేయ‌డానికి బాక్సాఫీస్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అందులో ఫ్లాపుల్లో ఉన్న హీరోలే ఎక్కువ మంది ఉన్నారు. చాలా కాలంగా హిట్లు లేక‌.. పూర్తిగా కెరీర్ డైల‌మాలో ఉన్న స్టేజ్ లో ఇప్పుడు జులై స‌మ‌రం చేస్తున్నారు. జులై పోరుకు ముందుగా సిద్ధ‌మైన హీరో గోపీచంద్. ఈయ‌న జులై 5న వస్తున్నాడు.
పంతం సినిమాతో ఈయ‌న త‌న అదృష్టం ప‌రీక్షించుకుంటున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తెర‌కెక్కించిన ఈ చిత్రంపైనే ఇప్పుడు గోపీచంద్ ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాత రోజే సాయిధ‌రంతేజ్ తేజ్ ఐ ల‌వ్యూ అంటూ వ‌స్తున్నాడు. ఈయ‌న‌కు కూడా తేజ్ ఫ‌లితం కీల‌క‌మే. వ‌ర‌స డిజాస్ట‌ర్స్ తో సాయి ఇమేజ్ పూర్తిగా ప‌డిపోయింది. ఇక ఇదే జులైలో వ‌స్తోన్న మ‌రో కుర్ర హీరో క‌ళ్యాణ్ దేవ్. మెగా కుటుంబం నుంచి వ‌స్తోన్న మ‌రో హీరో ఈయ‌న‌.
చిరు చిన్న‌ల్లుడు విజేత‌ సినిమాపై అంచ‌నాలు త‌క్కువ‌గానే ఉన్నా.. త‌క్కువ అంచనా మాత్రం వేయ‌కూడ‌దు. ఎందుకంటే మెగా కుటుంబం నుంచి వ‌స్తున్నాడు క‌దా.. ఆ మాత్రం హైప్ ఉంటుంది. పైగా పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జులై 20న రాజ్ త‌రుణ్ ల‌వర్ సినిమాతో వ‌స్తున్నాడు. అనీష్ కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. దాంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. బెల్లంకొండ శ్రీ‌నివాస్ సాక్ష్యం సైతం ఇదే నెల‌లో వ‌స్తుంది. సుమంత్ ఇదంజ‌గ‌త్ జులై చివ‌ర్లోనే విడుద‌ల కానుంది. ఇలా ఈ నెల‌లో క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. మ‌రి వీటిలో ఎవ‌రు గెలుస్తారో.. ఎవ‌రు ఓడ‌తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here