టాటూస్ క‌థేంటి బోయ‌పాటి..?

Ram Charan
బోయ‌పాటి సినిమా హీరో అంటే ఎలా ఉంటాడు..? ప‌క్కా మాస్ అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిస్తాడు. ప్ర‌తీ సినిమాలోనూ హీరోను శ‌క్తిమాన్ కంటే ప‌వ‌ర్ ఫుల్ గా చూపిస్తాడు బోయ‌పాటి శీను. ఇదే సినిమాకు క‌లిసొస్తుంది కూడా. బెల్లంకొండ లాంటి హీరోతో కూడా క‌త్తి ప‌ట్టించి త‌ల‌లు న‌రికించాడు ఈ ద‌ర్శ‌కుడు. అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఈయ‌న రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయ‌బోతున్నాడు. దీనికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్రీ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌యూనిట్. ఈ సినిమా జ‌న‌వ‌రి 19 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్ గా న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేనులో ఈమె న‌టిస్తుంది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ భామ‌నే కోరుకుంటున్నాడు.
చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా క‌థ రాజస్ధాన్ బ్యాక్ డ్రాప్ లో జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో చ‌ర‌ణ్ గ‌డ్డం.. ఒంటిపై ఫుల్ టాటూస్ వేసుకుని కొత్త లుక్ లో క‌నిపించ‌బోతున్నాడు. ఈయ‌న కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి మేక‌ప్ ఆర్టిస్టుల‌ను దించుతున్నాడు బోయ‌పాటి. రెగ్యుల‌ర్ మాస్ క‌థే అయినా కూడా ఈ సారి స్టైల్ డోస్ పెంచుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేయ‌న‌టువంటి స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఈ చిత్రంతో త‌న ఇమేజ్ కూడా మారిపోవాల‌ని చూస్తున్నాడు బోయ‌పాటి శీను. జ‌న‌వ‌రి 19న షూటింగ్ మొద‌లుపెట్టి.. కేవ‌లం ఎనిమిది నెల‌ల్లోనే ఈ చిత్రం పూర్తి చేసి ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది బోయ‌పాటి ల‌క్ష్యం. ఎందుకంటే త‌ర్వాత ఈయ‌న‌కు బాల‌య్య‌తో క‌మిట్ మెంట్ ఉంది.. మ‌రోవైపు చ‌ర‌ణ్ కూడా రాజ‌మౌళి సినిమా చేయాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here