టాప్ టెక్నిషియన్స్ ప్రశంసలు పొందుతున్న ‘రాజరథం’

Top technicians praise Rajaratham

ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి ‘టాక్ అఫ్ ది టౌన్’ గా ఉన్న ‘రాజరథం’ గురించి పరిచయం అక్కర్లేదు. అనేక అంశాలతో ఆకట్టుకుంటున్న ‘రాజరథం’, ఇప్పుడు ఆ చిత్రానికి పని చేస్తున్న టెక్నిషియన్స్ గురించే ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుకోవడం విశేషం. ఈ చిత్రానికి ‘సౌండ్’ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న రాజా కృష్ణన్ దేశంలోనే పేరొందిన టాప్ సౌండ్ మిక్సర్స్ లో ఒకరు. ‘ప్రేమమ్’, ‘బెంగుళూరు డేస్’,’విక్రమ్ వేద’,’అర్జున్ రెడ్డి’,’అ..ఆ..’, ‘నా పేరు సూర్య’ వంటి చిత్రాలకి ఈయన పని చేశారు.  ఆయన ‘రాజరథం’ కి మిక్సింగ్  చేస్తున్నప్పుడు దర్శకుడు అనూప్ చిత్రాన్ని సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్దిన విధానం చూసి రాజా కృష్ణన్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆయనే ఈ చిత్రానికి ‘డాల్బీ అట్మాస్’ అవసరం అని, దాని వల్ల ప్రేక్షకులకి మరింత అనుభూతి ని అందిచగలమని టీం ని ప్రోత్సహించారు. ఈ చిత్రానికి సంబందించిన ‘సౌండ్’ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుని చేస్తున్నారు. ” ఈ సినిమా నా కెరీర్ లో నే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ప్రేక్షకులు సినిమా చూశాక  సౌండ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు” అన్నారు.

‘బాహుబలి’, ‘ఈగ’, ‘దృశ్యం’, ‘రంగితరంగా’ వంటి చిత్రాలకి పని చేసిన ‘కలరిస్ట్’ శివ కుమార్ ‘రాజరథం’ కి పని చేయడం ఒక గొప్ప అనుభవం గా చెప్తున్నారు. దర్శకుడు అనూప్ తో ఎన్నో చర్చలు, ఎంతో సమయం గడిపిన శివ కుమార్ స్క్రిప్ట్ కి తగ్గట్టు ఆకట్టుకునే కలర్ పాల్లేట్స్ ని ఈ సినిమా కోసం వాడారు. ‘రాజరథం’ విడుదల అయ్యాక ఈ కలర్ పాల్లేట్స్ ని మరిన్ని సినిమాల్లో చూస్తారని అన్నారాయన.

నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య, రవిశంకర్, రానా దగ్గుబాటి వాయిస్ తో ఉన్న ‘రాజరథం’ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో అత్యున్నత ప్రమాణాలతో ఉండబోతోంది. ‘రాజరథం’ తో దర్శకుడు అనూప్ భండారి మరో సారి తెర మీద  తన మేజిక్ చూపించబోతున్నారు. నిర్మాణంలో తమ తొలి ప్రయత్నం గా ‘జాలీ హిట్స్’ నిర్మించిన  ‘రాజరథం’ ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 23 న విడుదల కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here