డిఎస్పీ అలా అయిపోయాడేంటి..?

DEVI SRI PRASAD NEW LOOK
దేవీ శ్రీ ప్ర‌సాద్ మారిపోయాడు.. అంటే మెంట‌ల్ గా కాదు.. ఫిజిక‌ల్ గా. ఈయ‌న ఇప్పుడు చూడ్డానికి చాలా స‌న్న‌గా మారిపోయాడు. ఒక‌ప్ప‌డు బొద్దుగా ఉండేవాడా అంటే కాదు కానీ మ‌రీ స‌న్న‌గా అయితే లేడు. కానీ ఇప్పుడు మాత్రం ఈయ‌న ఫిజిక్ లో చాలా మార్పులు వ‌చ్చాయి. హీరో అవుతున్నాడో ఏమో కానీ డిఎస్పీ బ‌రువు బాగా త‌గ్గిపోయాడు. అదేదో వీర‌మాచినేని డైట్ కానీ ఫాలో అయ్యాడో ఏమో కానీ దేవీని చూసి ఇప్పుడు షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.
మ‌నోడేంటి ఇంత‌గా స‌న్న‌బ‌డ్డాడు.. కొంప‌దీసీ ఏదైనా అనారోగ్యం వ‌చ్చిందా ఏంటని కంగారు ప‌డుతున్నారు కూడా. ఈ మ‌ధ్యే విడుద‌లైన సామి 2 మేకింగ్ వీడియోలో విక్ర‌మ్, కీర్తిసురేష్ తో పాడించాడు దేవీ. ఈ వీడియోలోనే తాను కూడా క‌నిపించాడు. ఇక్క‌డే మ‌నోడి కొత్త లుక్ బ‌య‌టికొచ్చింది. అయితే ఇదంతా హీరో ఛాన్స్ కోస‌మో.. లేదంటే మ‌రేదైనా డైటో కాద‌ని.. కావాల‌నే బ‌రువు త‌గ్గానంటున్నాడు దేవీ శ్రీ ప్ర‌సాద్.
ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలున్నాయి. తెలుగులో రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి.. మ‌హేశ్-వంశీ.. సుకుమార్-మ‌హేశ్.. అనిల్ రావిపూడి ఎఫ్ 2తో పాటు మ‌రిన్ని సినిమాల‌కు కూడా క‌మిట‌య్యాడు. త‌మిళ్ లోనూ సామి 2తో పాటు ఇంకొన్ని సినిమాలకు ప‌ని చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉన్న‌పుడు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి క‌దా.. అందుకే కాస్త బ‌రువు త‌గ్గి స్లిమ్ అయ్యాడంతే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here