డిసెంబ‌ర్ 15న `ఇదీ మా ప్రేమ‌క‌థ‌`

యాంకర్ రవి హీరోగా పరిచమవుతున్న  చిత్రం `ఇది మా ప్రేమ కథ`. `శశిరేఖా పరిణయం` సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తోంది. మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర క‌థానాయ‌కుడు యాంక‌ర్ ర‌వి మాట్లాడుతూ.. “ప‌రిశ్ర‌మ‌కి యాంక‌ర్‌గా వ‌చ్చి ఏడేళ్ల‌యింది. ఒక‌వేళ వెండితెర‌ క‌థానాయ‌కుడిగా చేస్తే ఒకే సినిమాకి ప‌రిమితం కాకూడ‌దు. అందుకే నా ప‌రిచ‌య చిత్రం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఉండాల‌ని భావించి చేశాను. ఫైనల్ గా చాలా మంది సజీషన్స్ తీసుకొని ఈ సినిమా చేశాను.. సీరియల్ న‌టి మేఘన ఈ సినిమాలో నాతో హీరోయిన్ గా నటించింది.  డైరెక్టర్ అయోధ్య మంచి ఫీల్ తో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించాడు. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, మాస్ రాజా ర‌వితేజ నా ఇన‌న్‌స్పిరేష‌న్‌. తొలి ప్ర‌య‌త్న‌మే చ‌క్క‌ని క‌థాంశం, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కుదిరారు. ఆర్నెళ్ల పాటు ప్రీప్రొడ‌క్ష‌న్‌కే స‌మ‌యం కేటాయించి ప‌ని చేశాం. `ఇదీ నా ప్రేమకథ` చ‌క్క‌ని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందింది. ఇదివ‌ర‌కే తొలి కాపీ వ‌చ్చినా మంచి రిలీజ్ తేదీ కోసం వేచి చూశాం. డిసెంబ‌ర్15న  సినిమా రిలీజ్ చేస్తున్నాం.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ -“సినిమా చాలా స‌హ‌జంగా వ‌చ్చింది. అంద‌రికీ క‌నెక్ట‌వుతుంది. ఈ సినిమా విష‌యంలో ముగ్గురికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా. సంగీత ద‌ర్శ‌కుడు కార్తిక్‌, స‌హ‌నిర్మాత కం లిరిసిస్ట్ దినేష్‌, తేజల‌కు స్పెష‌ల్ థాంక్స్‌. డెబ్యూ ద‌ర్శ‌కుడిని అయినా అంద‌రూ స‌పోర్ట్ చేశారు. సినిమా ఇంత బాగా రావ‌డానికి సాయ‌ప‌డ్డారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందించి, ద‌ర్శ‌కుడిగా నాకు మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నా“ అన్నారు.
నిర్మాత పి.ఎల్‌.కె.రెడ్డి మాట్లాడుతూ-“అయోధ్య కు ఈ క‌థ చెప్పిన‌ప్పుడు డీల్ చేస్తాడా?  లేదా? అనుకున్నా. కొంత షూట్ చేసి తీసుకు ర‌మ‌న్నాను. ప్ర‌తిభ‌ను నిరూపించుకుని అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బాగా వ‌చ్చింది. రిలీజ్ ముందే పాట‌లు అంద‌రికీ చేరువ‌య్యాయి. సంగీత ద‌ర్శ‌కుడు కార్తీక్‌, దినేష్‌ల‌కు థాంక్స్‌. ఈనెల 15న సినిమా రిలీజ‌వుతోంది“ అన్నారు. కార్య‌క్ర‌మంలో గెట‌ప్ శ్రీ‌ను, లోబో, ఫిల్మీ జంక్ష‌న్ నందు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here