తండ్రి కోరిక తీరుస్తున్న రామ్ చ‌ర‌ణ్..


అవును.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ఇదే ప‌నిమీద ఉన్నాడు. ఇన్నాళ్లూ చ‌ర‌ణ్ లో కేవ‌లం న‌టున్ని మాత్ర‌మే చూసాం. కానీ ఇప్పుడు నిర్మాత‌ను కూడా చూస్తున్నాం. తండ్రి కోసం వ‌ర‌స‌గా సినిమాలు నిర్మిస్తున్నాడు మెగా వార‌సుడు. ఇక ఇప్పుడు ఈయ‌న‌లో మ‌రో కోణం కూడా ప్రేక్ష‌కుల‌కు చూడ‌బో తున్నార‌ని తెలుస్తుంది. అదే స్టూడియో ఓన‌ర్ గా. అవును.. ఇప్ప‌టికే తెలుగులో ఉన్న టాప్ ఫ్యామిలీస్ అంద‌రికీ స్టూడియోలు ఉన్నాయి.
ఒక్క మెగా ఫ్యామిలీకి త‌ప్ప‌. అక్కినేనికి అన్న‌పూర్ణ‌.. నంద‌మూరికి రామ‌కృకృష్ణ‌.. ద‌గ్గుపాటికి రామానాయుడు.. ఘ‌ట్ట‌మనేనికి ప‌ద్మాల‌యా.. ఇలా ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో స్టూడియో ఉంది కానీ చిరంజీవి మాత్ర‌మే ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఈయ‌న కూడా స్టూడియో నిర్మాణం చేయాల‌ని చూస్తున్నాడు. రంగ‌స్థ‌లం కోసం ఆ మ‌ధ్య పాతిక ఎక‌రాల స్థ‌లం తీసుకుని అక్క‌డే ఊరు సెట్టేసారు. అక్క‌డే ఇప్పుడు సైరా షూటింగ్ జ‌రుగుతుంది. ఇదే ప్లేస్ ను రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు కొనేసాడ‌ని తెలుస్తుంది. అక్క‌డే స్టూడియో నిర్మాణం చేయాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్.
దీనికి ఇప్ప‌టికే అన్ని అనుమ‌తులు కూడా వ‌చ్చేసాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే ఏడాది స్టూడియో నిర్మాణం చేప‌ట్టాల‌ని చూస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. మిగిలిన స్టూడియోల రేంజ్ లో కాక‌పోయినా.. త‌మ‌కంటూ ఓ చిన్న స్టూడియో నిర్మించాల‌ని ఆలోచిస్తున్నాడు మెగా వార‌సుడు. అదే కానీ జ‌రిగితే మెగా కుటుంబం కూడా స్టూడియో ఓన‌ర్స్ అయిపోతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here