తమిళ్ ఇండ‌స్ట్రీ బాయ్ కాట్ చేసిందిగా..!

అర‌వోళ్లు ఏం చేసినా ఇలాగే ఉంటుంది. వాళ్ల అభిమానం.. ప్రేమ‌.. కోపం ఏదీ త‌ట్టుకోలేం. అన్నీ ఎక్స్ ట్రీమ్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ల కోపంలో ఉన్నారు. అది కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డుల మీద‌. ఈ మ‌ధ్యే ఈ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం నుంచి అంద‌రూ వ‌చ్చారు కానీ త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి మాత్రం చాలా మంది రాలేదు. దానికి కార‌ణం ఒక్క‌టే.. బాయ్ కాట్ చేయ‌డం. అవును..

ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్ష‌న్ ను అర‌వోళ్లు బాయ్ కాట్ చేసారు. విశాల్ ఈ మ‌ధ్యే ఓ రూల్ పాస్ చేసాడు. ఎక్క‌డ త‌మిళ ఇండ‌స్ట్రీకి సంబంధించి వేడుక జ‌రిగినా అందులో కాస్త ఫండ్ న‌డిగ‌ర్ సంఘానికి ఇవ్వాలి అని. అయితే ఫిల్మ్ ఫేర్ దీనికి ఒప్పుకోలేదు. దాంతో ఈ వేడుక‌ను బాయ్ కాట్ చేసారు త‌మిళ హీరోలు.. హీరోయిన్లు. అందుకే ఉత్త‌మ న‌టుడు, న‌టి అవార్డులు గెలుచుకున్న విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార కూడా క‌నిపించ‌లేదు.

ఒక్క మాధ‌వ‌న్ మాత్రమే అక్క‌డ ఉన్నారు. అయితే అంతా డుమ్మా కొట్టినా విశాల్ ప్రేయ‌సి వర‌ల‌క్ష్మి మాత్రం ఈ వేడుక‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. చీరక‌ట్టులో చంద‌మామ‌లా క‌నిపించింది వ‌రల‌క్ష్మి. మొత్తానికి ఇండ‌స్ట్రీ మొత్తాన్ని శాసించినా ల‌వ‌ర్ ను మాత్రం ఆప‌లేక‌పోయాడు విశాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here