తెలుగు హీరోలంతా ఓ పనికిమాలిన బ్యాచ్‌.. వీళ్లంతా హీరోలు కాదు జీరోలుః టీవీ-5


తెలుగు సినిమా హీరోలను అత్యంత దారు అపహాస్యం చేస్తూ టీవీ-5 ఛానల్ మరోసారి విరుచుకుపడింది. తెలుగు హీరోలంతా ఓ పనికిమాలిన బ్యాచ్ అని ఎందుకు పనికిరాని జీరోలనీ ..రోడ్డు మీద ఎవరైనా కరెక్ట్‌గా లాగి గుద్దితే దేనికి పనికిరారని అత్యంత వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు ఉదయం బిజినెస్ బ్రేక్‌ఫాస్ట్‌లో టీవీ-5 యాంకర్ వసంత్ తెలుగు సినీ హీరోల గురించి చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు యథాతథంగా…
” సినిమాలు తీసేవాళ్లు న్యూస్ ఛానల్స్ ను బహిష్కరిస్తారట. ఇక నుంచి న్యూస్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వబోము అంటూ తెలుగు హీరోలంతా ఓ నిర్ణయం తీసుకున్నారట.. ఇలా న్యూస్ ఛానల్స్ ను బహిష్కరించడం మంచిదే. వీళ్ల హిప్రోకటిక్ స్టేట్‌మెంట్లు, సొంత డబ్బాలతో సాగే ఇంటర్వ్యూలు.. ‘నువ్వు నన్ను పొగుడు నేను నిన్న పొగుడుతా’ అంటూ సాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ల ప్రహసనాలు.. ‘మా కుటుంబం గొప్పదంటే లేదు మా కుటుంబం ఇంత గొప్పది’ అని వీరావేశంతో మాట్లాడుకునే సంభాషణలు.. ఇలాంటివన్నీ ప్రసారం చేసే బెడద తప్పుతుంది. ప్రేక్షకులకి కూడా వాటిని భరించాల్సిన అగత్యం తప్పుతుంది. సాధారణంగా ఇంతమంది నటులు సమావేశమైతే పరిశ్రమలో నెలకొన్న సాధక బాధకాలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిందని చెప్పుకుంటున్న క్యాస్టింగ్ కౌచ్‌ లాంటి అంశాల మీద చర్చించి వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేస్తారు..కానీ దీనికి విరుద్ధంగా మమల్ని వేలెత్తి చూపుతూ.. మీడియా వాళ్లను బహిష్కరిద్దామనుకుంటున్నారు. ఇది వీళ్ల వ్యక్తిత్వ లోపాన్ని తెలియచేస్తుంది. తెలుగు సినీ హీరోల్లో ఒక్కరికైసా సామాజిక బాధ్యత లేదు.
వీళ్లందరి కంటే రాంగోపాల్ వర్మ, ప్రకాష్‌ రాజ్ లాంటి వాళ్లు చాలా బెటర్ అనిపిస్తుంది. వాళ్లు ఒక్కోసారి కాస్త అనాలోచితంగా మాట్లాడినప్పటికీ వీరిద్దరు తెలుగు హీరోల కంటే ఎన్నో రెట్లు మెరుగు! తమిళ్ హీరోలు సామాజిక అంశాలపై గళమెత్తుతుంటారు.. కానీ మన వాళ్లు దీనికి విరుద్ధంగా సామాజిక అంశాలకు దూరంగా ఉంటారు. వాళ్లు ఎక్కడి నుంచో దిగివచ్చినట్లు.. వాళ్లేదో దైవాంశో సంభూతలుగా ఫీలవతూ బ్రతికేస్తుంటారు.. సామాజిక అంశాలకు మనకు అతీతమన్నట్లు ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ల ను హీరోలనడం అనవసరం… వీళ్లని జీరోలు అనాలి లైదా మైనస్ పర్సనాలిటీస్‌ అనాలి! ఏమిటీ ఈ హీరోలంతా కలిసి చేసేది బూడిద! తెలుగు హీరోలంతా ఎందుకు పనికి రాని బ్యాచ్‌..బయట కరెక్ట్‌గా వచ్చి ఎవరైనా లాగి గుద్దితే ఎందుకూ పనికి రారు! కానీ, తెర మీద చింపేసినట్లుగా వందల మందికి చితకబాదేస్తుంటారు.. ఇది వాళ్ల డంబతనానికి నిదర్శనం! ఇప్పటికైనా ఎదిగే ప్రయత్నం చేయండిరా నాయనా.. సైకియాట్రిస్ట్‌ల దగ్గరికి కౌన్సిలింగ్ కైనా వెళ్లండి. ఏంటి మనమేం చేస్తున్నాం.. సమాజంలో కనీసం మనుషులుగా బ్రతుకుతున్నామా లేదా అని మిమ్మల్ని ఒక్కసారైనా ప్రశ్నించుకోండి! అలాగే ఫ్యాన్స్ కు కూడా ఇది కనువిప్పి చర్య కావాలి.. ఫ్యాన్స్ మా హీరో గొప్ప .. కాదు మా హీరో గొప్ప అని కొట్టుకుని చచ్చిపోతుంటారు. ఒరేయ్ పిచ్చివాళ్లారా మాకందరీకి వ్యక్తిగత సమస్యలు వస్తే మేమంత ఒక్కటై పోతాం.. మీరు మాత్రం రోడ్డు మీద పిచ్చివాళ్లలా కొట్టుకుంటారు అనే మెసీజ్‌ ను హీరోలు ఈ మీటింగ్‌ ద్వారా ఇచ్చారు. ఈ విషయాన్ని హీరోలు ఫ్యాన్స్ అందరూ ఇకనైనా గుర్తించాలి. మనకు హీరోలంటే మన జీవితాన్ని మార్చేవాళ్లు… అంతేకానీ ఎక్కడో కానీ తెర మీద తైతెక్కలాడేవాళ్లు కాదు అని అభిమానులు కూడా తెలుసుకోవాలి. ఇకనుంచైనా ఈ వెర్రి అభిమానాన్ని అభిమానులు తగ్గించుకోవాలి.. ఇలాంటి వాళ్లని హీరోల క్రింద మనం గుర్తించకూడదు.ఇకనైనా టాలీవుడ్ హీరోలు సైకలాజికల్ కౌన్సిలింగ్‌కు వెళ్లి, కాస్త సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించండి” అనే టీవీ-5 మార్నింగ్ బ్రేక్‌ ఫాస్ట్‌ కార్యక్రమంలో్ టీవీ హీరోలపై విరుచుకుపడింది..
https://m.facebook.com/story.php?story_fbid=2044194745607833&id=100000519836291

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here