తేజ్ ట్రైల‌ర్.. అన్నీ చూసిన‌వే క‌దా తేజ్..?

సాధార‌ణంగా కొన్ని సినిమాలు చూడ‌గానే ఇది ఫ‌లానా ద‌ర్శ‌కుడి సినిమా అని చెప్పేయొచ్చు. అంత‌గా బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఉంటారు స‌దరు ద‌ర్శ‌కులు. ఈ లిస్ట్ లో క‌రుణాక‌ర‌ణ్ కూడా ఉన్నాడు. 20 ఏళ్ల కింద ఈయ‌న తెర‌కెక్కించిన తొలిప్రేమ ఇప్ప‌టికీ నిత్య‌నూత‌నంగానే ఉంది. ఆ ఒక్క సినిమా పేరు చెప్పి ఇప్ప‌టికి 10 సినిమాలు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. అందులో రెండు విజ‌యాలు సాధించాయి.

మిగిలిన సినిమాల‌న్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయాయి. కానీ ఈయ‌న ప్ర‌తీ సినిమాలోనూ కొన్ని సీన్స్ మాత్రం సేమ్ టూ సేమ్ క‌నిపిస్తుంటాయి. ఇప్పుడు ఈయ‌న సాయిధ‌రంతేజ్ తో తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుద‌లైంది. ప్రోమో సాంగ్స్ చూస్తుంటే చిన్న‌దాన నీకోసం.. ఎందుకంటే ప్రేమంట‌.. డార్లింగ్ లాంటి సినిమాలు గుర్తొస్తున్నాయి. అందులో ఉన్న విజువ‌ల్సే మ‌ళ్లీ ఇందులోనూ రిపీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌లైంది.. ఇందులో మ‌రీ దారుణంగా పాత విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి.

హీరో వెంట మ్యూజిక్ బ్యాచ్ డార్లింగ్ ను గుర్తు చేస్తుంటే.. హీరోయిన్ ఆట ప‌ట్టించే సీన్స్ అన్నీ ఎందుకంటే ప్రేమంట‌ను గుర్తు చేస్తున్నాయి. కాక‌పోతే హీరో మారాడు.. హీరోయిన్ మారింది అంతే తేడా..! మిగిలిందంతా సేమ్ టూ సేమ్. ఇది క‌రుణాక‌ర‌ణ్ స్టైల్ అని స‌రిపెట్టుకోవాలా లేదంటే ఇంత‌కంటే తాను కొత్త‌గా ఏం తీయ‌లేన‌ని ప్రేక్ష‌కుల‌కు చెబుతున్నాడ‌ని అర్థం చేసుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితి..! జులై 6న‌ తేజ్ ఐ ల‌వ్ యూ విడుద‌ల కానుంది. మ‌రి చూడాలి.. ఈ చిత్రంతో ఎంత‌వ‌ర‌కు మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here