తేజ్ లో మొద‌లైన అంత‌ర్మ‌థ‌నం..!

SAI-DHARAM-TEJ
ఇండ‌స్ట్రీ అంటేనే వైకుంఠ‌పాళి ఆట‌. ఇక్క‌డ నిచ్చెన‌లు అనే హిట్లు ఎక్కుకుంటూ ల‌క్ష్యం చేరువ‌వ్వాలి. అంతేకానీ ఫ్లాపులు అనే పాముల నోట్లో ప‌డితే ఎక్కిన మెట్లు కూడా దిగాల్సి వ‌స్తుంది. ఇప్పుడు సాయిధ‌రంతేజ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మొద‌ట్లోనే వ‌ర‌స‌గా నిచ్చెన‌లు ఎక్కి టాప్ లెవ‌ల్ కు చేరుకున్నాడు. కానీ తిక్క అనే పెద్ద పాము సాయిని మింగేసింది. ఆ త‌ర్వాత నిచ్చెన‌లు రావ‌డం మానేసాయి.
వ‌ర‌స‌గా విన్న‌ర్ అనే మ‌రో పాము కాటేసింది. దాని దెబ్బ నుంచి కోలుకోక ముందే న‌క్ష‌త్రం రూపంలో అన‌కొండ వ‌చ్చి మింగేసింది. అయ్యోరామా అనుకుంటున్న టైమ్ లో మందు రాస్తుందేమో అనుకున్న జ‌వాన్ అనే మ‌రో పాము వెన‌క నుంచి వ‌చ్చి కాటేసింది. ఇన్ని కాట్లు ప‌డిన త‌ర్వాత కూడా ఇంకా నిచ్చెన వ‌స్తుంద‌నే ఆశ‌తోనే ఉన్నాడు సాయిధ‌రంతేజ్. అలాంటి టైమ్ లో వ‌చ్చిన ఇంటిలిజెంట్ అన్నింటికంటే పెద్ద కాటేసింది. దెబ్బ‌కు టాప్ కి వెళ్లిపోదాం అనుకున్న సాయికి ఈ చిత్రం కింది నుంచి టాప్ కు తీసుకెళ్లింది.
త‌న కెరీర్ ను పూర్తిగా మింగేయ‌డానికి వ‌చ్చిన అతిపెద్ద పురాత‌న అన‌కొండ ఇదే అని గ్ర‌హించలేకేపోయాడు మెగా మేన‌ల్లుడు. ఈ కాటు దెబ్బ‌కు సాయి ఇప్ప‌ట్లో లేచేలా కూడా క‌నిపించ‌ట్లేదు. అంత దారుణమైన కాటు ప‌డింది. తేజ్ ఐ ల‌వ్ యూ కూడా క‌నీసం 5 కోట్ల మార్క్ కూడా అందుకోవ‌డం లేదంటే సాయి ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. దాంతో ఇప్ప‌ట్నుంచి ద‌ర్శ‌కుల బ్రాండ్ కాద‌ని.. క‌థ‌ను న‌మ్ముకోవాల‌ని చూస్తున్నాడు తేజ్. ఇప్ప‌టికే కిషోర్ తిరుమ‌ల‌తో చిత్ర‌ల‌హ‌రి.. గోపీచంద్ మ‌లినేనితో ఓ మెడిక‌ల్ మాఫియా సినిమా చేయ‌బోతున్నాడు సాయి. అయితే ఇవి ఇప్పుడు కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని మొద‌లు పెట్ట‌నున్నాడు. మ‌రి ఈ అంత‌ర్మ‌థ‌నం అయినా సాయిని బ‌య‌ట ప‌డేస్తుందో లేదో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here