త్రివిక్ర‌మ్ అలా డిసైడ్ చేసాడు..!

TRIVIKRAM-NTR-NOT-ALLOWING-PHONES-INTO-SETS
ఇంటిదొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్ట‌లేడంటారు. అంతేక‌దా.. న‌మ్మ‌కంగా ఉండి పోటు పొడిస్తే ఎవ‌రు మాత్రం గుర్తు ప‌డ‌తారు చెప్పండి. ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రంలోని స్టిల్స్ కొన్ని విడుద‌ల‌య్యాయి. అది కూడా దొంగ‌త‌నంగా.. ఎడిటింగ్ టేబుల్ మీద నుంచి మాయ‌మై. అంటే ఇది క‌చ్చితంగా బ‌య‌టి వాళ్ల ప‌నైతే కాదు.. ఎందుకంటే బ‌య‌టి వాళ్ల‌కు ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌రికి వ‌చ్చేంత ఫ్రీడ‌మ్ ఉండ‌దు.. అంత ఛాన్స్ కూడా ఉండ‌దు. దాంతో ఇది యూనిట్ మెంబ‌ర్స్ చేసిన ప‌ని అని త్రివిక్ర‌మ్ తో పాటు ఎన్టీఆర్ కూడా డిసైడ్ చేసుకుని ఇప్పుడు ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.
సినిమా షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు సెట్ లోకి ఫోన్స్ నాట్ అలోడ్ అనేసారు. ఎంత‌టి వారైనా.. ఎంత పెద్ద న‌టుడైనా సెట్ లోకి వ‌చ్చేట‌ప్పుడు ఫోన్ తీసుకురాకూడ‌దు. అలాగే క్ర్యూకు కూడా ఇదే విష‌యం సీరియ‌స్ గా చెప్పాడు త్రివిక్ర‌మ్. మొన్న లీక్ అయిన స్టిల్ తో బ‌య‌ట సినిమా క‌థ‌పై కావాల్సిన‌న్ని స్టోరీలు అల్లేస్తున్నారు. అందులో గాయ‌ప‌డిన నాగ‌బాబును ఎన్టీఆర్ కాపాడుతున్నాడు. ఈ స్టిల్ తో క‌థపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. అందుకే పూర్తిన‌ష్టం జ‌ర‌క్క‌ముందే త్రివిక్ర‌మ్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లు పెట్టాడు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here