త‌మిళ‌నాట బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచిన విజ‌య్ “అదిరింది” తెలుగు లో త్వ‌ర‌లో విడుద‌ల‌

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది త‌మిళంలో విడుద‌ల‌య్యి మంచి టాక్ ని సోంతం చేసుకుంది. ఇప్ప‌డు క‌లెక్ష‌న్ల తో అటు ఓవ‌ర్‌సీస్‌, ఇటు అర్జ‌న్ ఎరియాల్లో కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ రేంజికి దూసుకుపోతుంది. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు.

అతిత్వ‌ర‌లో తెల‌గు సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని 400 దియోట‌ర్స్ లో విడుద‌ల కి సిధ్ధ‌మ‌వుతుంది.

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

మురళీ రామస్వామి మాట్లాడుతూ… నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్ తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అతిత్వ‌ర‌లో అందించనున్నాం. ఇప్ప‌టికే త‌మిళం లో విడుద‌ల‌య్యి బ్లాక్‌బ‌స్ట‌ర్ గా దూసుకుపోతుంది. సిని విమ‌ర్శ‌కుల నుండి సామాన్య ప్రేక్ష‌కుల దాకా ద‌ర్శ‌కుడు అట్లి పై ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ అండ్ సెంటిమెంట్ ఎపిసోడ్స్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి ప్ర‌శంశ‌లు వ‌స్తున్నాయి. త‌రువాత మేజ‌ర్ గా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కి ఆ రేంజి అప్లాజ్ వ‌స్తుంది. ఈ చిత్రం ఓవ‌ర్‌సీస్ నుండి అర్జ‌న్ ఎరియాల వ‌ర‌కూ అన్ని చోట్ల రికార్డు క‌లెక్ష‌న్లు సొంతం చేసుకుంటుంది. విజ‌య్ కెరీర్ లో ద బెస్ట్ చిత్రం గా నిల‌వ‌నుంది. నువ్వు ముట్టుకున్న‌ది అగ్నిగోళం.. ద‌హించివేయుట దాని ధ‌ర్మం లాంటి డైలాగ్స్‌ బాగా ఫ్యామ‌స్ అయ్యింది. విజ‌య్ లుక్ బాగుంద‌ని చూసిన‌వారంద‌రూ అంటున్నారు. ద‌ర్శ‌కుడు అట్లీ చాలా సున్నిత‌మైన స్క్రీప్ట్ ని క‌మ‌ర్షియ‌ల్ తీసారు. హీరోయిన్స్ సమంత‌, కాజ‌ల్‌, నిత్యామీన‌న్ చాలా బాగా న‌టించారు. ఈ దీపావ‌ళి కి త‌మిళ‌నాట విజ‌య్ ఫ్యాన్స్ నిజ‌మైన పండ‌గ చేసుకున్నారు. అతి త్వ‌ర‌లో తెలుగులో తీసుకువ‌స్తాము. అని అన్నారు.

శరత్ మరార్ మాట్లాడుతూ… విజ‌య్ న‌టించిన అదిరిందిలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో గ్రాండ్ గా అతిత్వ‌రలో రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాతో విజయ్ కి తెలుగు లో క్రేజ్ ట్రేడ్‌లో బిజినెస్‌ రేంజ్ పెరుగుతుంది. త‌మిళం లో చిత్రాన్ని చూసిన వారంద‌రూ ద‌ర్శ‌కుడు అట్లి గురించి ప్ర‌శంశ‌లు కురిపిస్తున్నారు. అలాగే యాక్ష‌న్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ అండ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు . విజ‌య్ ఫెర్‌ఫార్మెన్స్ మ‌రో రేంజి లో వుంది. స‌మంత‌, కాజ‌ల్, నిత్యామీన‌న్ లు పోటాపోటీగా న‌టించారు. ఈ చిత్రాన్ని అతిత్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌కి 400 దియోట‌ర్స్ లో అందించ‌బోతున్నాం.. అన్నారు

ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది.

నటీనటులు – విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్

సాంకేతిక నిపుణులు
సంగీతం – ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం – వివేక్
సినిమాటోగ్రాఫర్ – జి.కె.విష్ణు
ఎడిటర్ – రుబన్
యాక్షన్ – అనల్ అరసు
కొరియోగ్రఫి – శోభి
స్టోరీ – విజయేంద్రప్రసాద్
స్క్రీన్ ప్లే – విజయేంద్ర ప్రసాద్, రమణ గిరివాసన్
నిర్మాతలు – మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – అట్లీ