త‌మ్మున్ని ఛాలెంజ్ చేసిన చిరంజీవి.

CHIRANJEEVI PAVAN KALYAN
అవును.. ఇప్పుడు త‌మ్మున్నే ఛాలెంజ్ చేసాడు చిరంజీవి. ప‌వ‌న్ ఉన్న బిజీని గుర్తించి.. ఆయ‌న‌కు ఓ ప‌ని అప్ప‌చెప్పాడు అన్న‌య్య. ఇప్పుడు హ‌రిత హారం కార్య‌క్ర‌మం బాగా జోరందుకుంది. ఐస్ బ‌కెట్.. ఫిట్ నెస్ ఛాలెంజ్ మాదిరే ఇప్పుడు మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం కూడా జ‌రుగుతుంది. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సినిమా వాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఎన్టీవీ ఛైర్మెన్ నరేంద్ర చౌద‌రి విసిరిన ఛాలెంజ్ ను తీసుకుని తాను మూడు మొక్క‌లు నాటాడు చిరంజీవి. త‌న ఇంటి పెర‌ట్లోనే ఈ ప‌ని చేసాడు.
ఇక త‌ను చేసిన త‌ర్వాత మ‌రో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసిరాడు. అమితాబ్ బ‌చ్చ‌న్.. రామోజీరావ్ తో పాటు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా ఈ హ‌రిత‌హారం చాలెంజ్ విసిరాడు. దీన్ని వాళ్లు స్వీక‌రించి మ‌రో ముగ్గురుకు అలాగే చేయాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు మెగాస్టార్. ఇంత మంచి కార్య‌క్ర‌మంలో త‌న‌ను కూడా భాగం చేసినందుకు సంతోషం వ్య‌క్తం చేసాడు చిరంజీవి. మ‌రి అన్న‌య్య విసిరిన ఛాలెంజ్ ను త‌మ్ముడు స్వీక‌రిస్తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here