త‌మ‌న్నాకు పెళ్లంట‌.. న‌మ్మ‌మంటారా..?


అవ‌కాశాలు వ‌చ్చిన‌న్ని రోజులు ఎవ‌రి మాటా విన‌రు. స్టార్ హీరోయిన్లుగా చ‌క్రం తిప్పేస్తుంటారు. ఒక్క‌సారి ఆఫ‌ర్లు త‌గ్గిన త‌ర్వాత చిన్న సినిమాకు కూడా సై అనేస్తుంటారు. మ‌రీ అవి కూడా రాన‌పుడు ఇంక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంటారు. చ‌రిత్ర చెబుతున్న సత్యం ఇదే. పూర్తిగా కెరీర్ క్లోజ్ అవుతుంద‌ని క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాతే పెళ్లి మాట ఎత్తుతారు హీరోయిన్లు. ఇప్పుడు త‌మ‌న్నా కూడా ఇదే లిస్ట్ లో చేరిపోయింది. ఈ భామ కూడా త‌న పెళ్లిపై ఆలోచ‌న‌లో ప‌డింద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఓ వ‌రున్ని కూడా చూసుకుంద‌ని..
అమెరికాలో ఆయ‌న డాక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చాలా మంది హీరోయిన్ల మాదిరే త‌మ్మూ కూడా త‌న సేఫ్టీ చూసుకుంటుంది. లైఫ్ సెటిల్ మెంట్ ప్లాన్ చేసుకుంటుంది. డాక్ట‌ర్ అంటే ఆదాయం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పెళ్లైన త‌ర్వాత అమెరికాలోనే సెటిల్ అయ్యేట్లు అంతా సిద్ధ‌మైపోతుంది మిల్కీబ్యూటీ. డాక్ట‌ర్ గానే కాదు.. అక్క‌డ గురుడికి చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయ‌ని తెలుస్తుంది.
ఇప్ప‌టికే వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే అన్నాయ‌ని వీలైనంత త్వరలో ఈ జంట ఒక్క‌టి కానున్నార‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం తెలుగులో వెంక‌టేశ్ కు జోడీగా అనిల్ రావిపూడి ఎఫ్ 2లో.. సైరాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది త‌మ‌న్నా. మ‌రి పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తుందో లేదో అనేది మాత్రం ఆస‌క్తిక‌రంగానే మారింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here