థ‌మ‌న్ నిజంగానే అలాంటివాడా..?

SS THAMAN MOVIES FAST RACE
థ‌మ‌న్.. ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. చిన్న వాళ్ల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు అంద‌రి సినిమాల‌తో బిజీగా ఉంటాడు ఈ కుర్ర సంగీత త‌రంగం. కానీ అంద‌రూ థ‌మ‌న్ సంగీతం గురించి చెప్పాల్సి వ‌చ్చిన‌పుడు ఒక‌టే మాట చెబుతున్నారు. అది కావాల‌ని చెబుతున్నారో.. లేదంటే నిజంగానే థ‌మ‌న్ అలా ఉంటాడో తెలియ‌దు కానీ మ్యూజిక్ ఇవ్వ‌డం విష‌యంలో మాత్రం థ‌మ‌న్ చాలా తిప్ప‌లు పెడ‌తాడ‌నే రూమ‌ర్స్ ఉన్నాయి. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల మాట‌లు వింటుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. అల్లు అర‌వింద్ లాంటి నిర్మాత కూడా థ‌మ‌న్ నుంచి సంగీతం రాబ‌ట్టుకోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి.. అస్సలు దొర‌క‌డు అనేసాడు తొలిప్రేమ ఆడియో వేడుక‌లో. ఇక అప్పుడు జ‌వాన్ టైమ్ లో కూడా థ‌మ‌న్ ను కాకా ప‌డితే కానీ మంచి సంగీతం రాద‌ని ద‌ర్శ‌కుడు బివిఎస్ ర‌వి అన్నాడు. థ‌మ‌న్ ను టార్చ‌ర్ చేసి మంచి పాట‌లు తీసుకోవాలంటూ హీరోలు కూడా చెబుతున్నారు. ఇదంతా వింటుంటే నిజంగానే థ‌మ‌న్ ఇలాంటి వాడే అనిపిస్తుంది.
కావాలంటే చూడండి.. థ‌మ‌న్ అంటే రిపీట్ మ్యూజిక్ అనే పేరుంది. కానీ ఇప్పుడు తొలిప్రేమ‌లో ఈయ‌న చాలా మారిపోయాడు. ఈయన పాట‌లు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. కెరీర్ మొద‌ట్లో వ‌చ్చిన పాట‌ల‌తో పోలిస్తే.. ఈ మ‌ధ్య కాలంలో థ‌మ‌న్ ఇచ్చిన పాట‌ల‌కు పెద్ద‌గా రెస్పాన్స్ అయితే రావ‌డం లేదు. కానీ చాలా రోజుల త‌ర్వాత ఈయ‌న పాట‌ల‌కు మంచి అప్లాజ్ వ‌స్తుంది. అదే తొలిప్రేమ‌. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించాడు. వెంకీఅట్లూరి ద‌ర్శ‌కుడు.  వెంకీ రాసుకున్న అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు త‌న అంద‌మైన సంగీతాన్ని తోడు చేసి.. శిల్పానికి ప్రాణం పోసాడు థ‌మ‌న్. ఈ ట్యూన్స్ కోసం థ‌మ‌న్ ను ఎంత‌గా ఇబ్బంది పెట్టుంటాడో ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.. ఆయ‌న క‌ష్టాన్ని త‌లుచుకుంటేనే జాలేస్తుంది. మొత్తానికి థ‌మ‌న్ తో మ్యూజిక్ కావాలంటే ఆయ‌న చెప్పినట్లు న‌డుచుకోవాల్సిందే అన్న‌మాట‌. లేక‌పోతే అంతే సంగ‌తులు.. అర‌లో ఉన్న ట్యూన్స్ సినిమాలోకి చేరిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here