దేవదాసు.. ఎవరికి వాళ్లే..?


నాగార్జున-నాని మల్టీస్టారర్ అంటే ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్ధామా అని అటు నాని.. ఇటు నాగార్జున అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. కానీ షూటింగ్ తోనే ఈ చిత్రం షాకుల మీద షాకులు ఇస్తుంది. ఓ వైపు నాగార్జున హిందీ సినిమా కోసం బల్గేరియా వెళ్లిపోయాడు.. మరోవైపు నాని బిగ్ బాస్ తో పాటు జెర్సీ సినిమా పనులతో బిజీ అయిపోయాడు..
ఇంకోవైపు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాత్రం రాత్రిపూట దేవదాసు షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అటు నాని.. ఇటు నాగార్జున లేకపోయినా దేవదాసు షూటింగ్ మాత్రం వేగంగా జరుగు తుంది. తమ హీరోలు లేకపోయినా.. వాళ్ళు లేని సీన్స్ అన్నీ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. వాళ్లొచ్చే సరికి అంతా సిద్ధం చేసి ఉంచాలనేది దర్శకుడి ప్లాన్. దానికి తగ్గట్లే దేవదాసు షూటింగ్ జరుగుతుంది. ముందు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదలకు ప్లాన్ చేసినా..
ఇప్పుడు అది నవంబర్ కు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే దసరాకు ఇప్పటికే చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారు. మధ్యలో వెళ్లి దేవదాసును ఇరికించడం నానితో పాటు నాగార్జునకు కూడా ఇష్టం లేదు. అందుకే కాస్త ఆలస్యం అయినా పర్లేదు కానీ కచ్చితంగా మంచి టైమ్ కు సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాత అశ్వినీ దత్. అన్నీ కుదిర్తే ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కు విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ లోపు నాగార్జున కూడా బ్రహ్మస్త్ర.. నాని కూడా బిగ్ బాస్ పూర్తి చేసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here