దేవ్ కు తోడుగా వ‌స్తున్న దాస్..


దేవ్.. దాస్.. ఈ పేర్లు గుర్తు పెట్టుకోండి.. రాబోయే కాలంలో వీటితో చాలా అవ‌స‌రం ఉంటుంది. ఇప్ప‌టికే దేవదాసు అనేది పాపుల‌ర్. ఈ పేరు అంత ఈజీగా మ‌రిచిపోవ‌డం సాధ్యం కాదు. 65 ఏళ్ల కింద నాగేశ్వ‌ర‌రావ్ న‌టించిన ఈ చిత్రం ఇప్ప‌టికీ నిత్య‌నూత‌నంగా ప్రేక్ష‌కుల క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూ ఉంది. ఇదే సినిమాను ఆ త‌ర్వాత చాలా మంది రీమేక్ చేసారు.. ఈ టైటిల్ ను కూడా వాడుకున్నారు.
కానీ ఎవ‌రూ ఏఎన్నార్ ను మ‌రిపించ‌లేదు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ ను చాలా విచిత్రంగా.. కొత్త‌గా వాడుకుంటున్నాడు నాగార్జున‌. నాన్న‌గారి టైటిల్ ను ప‌క్కా మాస్ సినిమా కోసం వాడు కుంటున్నాడు అక్కినేని వార‌సుడు. ఈయ‌న ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నానితో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా స‌గా నికి పైగా పూర్త‌యింది. ఈ చిత్రానికి దేవ్ దాస్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.
ఇందులో నాని డాక్ట‌ర్ దేవ్ గా న‌టిస్తుంటే.. నాగార్జున డాన్ దాస్ గా అల రించ‌బోతున్నాడు. ఫుల్ లెంత్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఇది తెర‌కెక్కుతోంది. దేవ్ దాస్ టైటిల్ ను ఇలా కూడా వాడుకోవ‌చ్చా అనే రేంజ్ లో షాక్ ఇచ్చాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ర‌ష్మిక మంద‌న్న, ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్లు. ఫ‌స్ట్ లుక్ మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here