నాగబాబు ప్రాణాలు ఎన్టీఆర్ చేతిలో..!


అదేంటి.. నాగ‌బాబు ప్రాణాల‌కు ఎన్టీఆర్ కు లింకేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అస‌లు ట్విస్ట్. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌లో న‌టిస్తున్నారు. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తుంది. ఈ చిత్రంలో నాగ‌బాబు ఓ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా న‌టిస్తున్నాడు.
ఈయ‌న కొడుకుగా ఎన్టీఆర్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. చాలా వేగంగా అర‌వింద స‌మేత షూటింగ్ పూర్తి చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. ద‌స‌రాకు విడుద‌ల తేదీ ఉండ‌టంతో వీర ఫాస్ట్ గా వీరరాఘ‌వున్ని సిద్ధం చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. అంతా బాగానే ఉంది కానీ ఒక్క విష‌యం మాత్రం ఈ చిత్ర‌యూనిట్ ను బాగా కంగారు పెడుతుంది.. అదే లీకుల బెడ‌ద‌.
ఇప్ప‌టికే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ బ‌య‌టికి వ‌చ్చేసాయి. ఇకిప్పుడు ఏకంగా షూటింగ్ పిక్ కూడా లీక్ అయింది. నాగ‌బాబు ఒంటినిండా దెబ్బ‌ల‌తో గాయ‌ప‌డుతుంటే.. ఎన్టీఆర్ అత‌న్ని జీప్ లో ఎక్కించుకుని బాధ‌గా త‌న వైపు చూస్తుంటాడు. ఈ పిక్ చూస్తుంటే సినిమాలో ఏ సంద‌ర్భంలో వ‌స్తుందో కూడా అర్థ‌మైపోతుంది. ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు సినిమాలో బాగానే ఉన్న‌ట్లు కూడా అర్థ‌మైపోతుంది. పూజాహెగ్డే ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. ఇషారెబ్బా మ‌రో చిన్న పాత్ర‌లో న‌టించ‌బోతుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. ఈ లీకులు సినిమాపై ఆస‌క్తి ఎంత‌వ‌ర‌కు పెంచేస్తాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here