నాగార్జున‌.. అక్క‌డా ఉంటా ఇక్క‌డా ఉంటా..!

NAGARJUNA ALL INDUSTRIES
రుద్ర‌మ‌దేవిలో అల్లుఅర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా..! నేను తెలుగు భాష లెక్క‌.. ఆడా ఉంటా ఈడా ఉంటానంటూ ర‌చ్చ చేసాడు బ‌న్నీ. ఇదే డైలాగ్ ఇప్పుడు నాగార్జున ఫాలో అవుతున్నాడు. ఈయ‌న కూడా ఇప్పుడు టాలీవుడ్ లో ఉంటా.. బాలీవుడ్ లో ఉంటా.. అవ‌స‌రం అయితే అర‌వం లోనూ ఉంటానంటున్నాడు. మ‌ధ్య‌లో మ‌ళ‌యాలం కూడా వెళ్తానంటున్నాడు. ఇలా దేశ‌మంతా నాదే అంటున్నాడు ఈ హీరో.
ఇన్నాళ్లూ తెలుగు ఇండ‌స్ట్రీపై ఎక్కువ‌గా దృష్టి పెట్టిన నాగ్.. ఇప్పుడు ప‌క్క ఇండ‌స్ట్రీల‌కు వెళ్తున్నాడు. మ‌ళ‌యాలంలో మోహ‌న్ లాల్ తో సినిమా చేయాల‌నుకున్నా కూడా బిజీ కార‌ణంగా ఆ సినిమా వ‌ద‌లేసుకున్నాడు నాగార్జున‌. అయితే హిందీకి వెళ్లాడు.
అక్క‌డ అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్ బీర్ క‌పూర్, అలియాభ‌ట్ కీల‌క‌పాత్ర‌ల్లో అయ‌న్ ముఖ‌ర్జి తెర‌కెక్కిస్తోన్న మ్యాగ్న‌మ్ ఓప‌స్ బ్ర‌హ్మ‌స్త్రలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు నాగార్జున‌.
ఇప్ప‌టికే బ‌ల్గేరియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసి వ‌చ్చాడు. 15 ఏళ్ల త‌ర్వాత హిందీలో నాగార్జున న‌టిస్తున్న సినిమా ఇది. 2003 లో ఎల్ఓసీ కార్గిల్ లో న‌టించాడు నాగార్జున‌. ఇప్పుడు బ్ర‌హ్మాస్త్ర 300 కోట్ల‌తో తెర‌కెక్క‌బోతుంది. క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌. గ‌తంలో నాగార్జున‌, అమితాబ్ ఖుదాగ‌వాలో న‌టించారు. అది బ్లాక్ బ‌స్ట‌ర్. ఆ త‌ర్వాత మ‌నంలో అతిథిపాత్ర చేసాడు బిగ్ బి. దాంతోపాటు త‌మిళ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇన్నేళ్ల త‌ర్వాత నాగ్ బాలీవుడ్ ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here