నాగార్జున‌-నాని.. మొద‌ల‌య్యేది ఆ రోజే..!

NANI NAGARJUNA MOVIE ON FEB 23
నానికి ఓ క‌థ చెప్పి ఒప్పించ‌డం అంటే మాట‌లు కాదు. ఎందుకంటే ఆయ‌న‌లోనూ ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడు. ఓ ద‌ర్శ‌కుడు క‌థ చెబుతుంటే త‌ను ముందే విజువ‌లైజ్ చేసుకుంటాడు. అందుకే నానికి వ‌ర‌స‌గా ఇన్ని విజ‌యాలు వ‌స్తున్నాయి. కొన్నిసార్లు రొటీన్ క‌థ‌లు కూడా హిట్ అవుతున్నాయంటే అది నాని క్రెడిట్టే. అందుకే క‌థ‌ల విష‌యంలో అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు న్యాచుర‌ల్ స్టార్. క‌థ న‌చ్చ‌క‌పోతే ఎవ‌రికైనా నో చెప్పేస్తాడు. అందుకే నాగార్జున‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసం కూడా ఇన్నాళ్లు తీసుకున్నాడు ఈ హీరో. సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కొన్ని రోజుల కింది వ‌ర‌కు ఈ చిత్రంపై కాస్తో కూస్తో ఏదో మూల‌న అనుమానం ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఒక్క ఇంట‌ర్వ్యూతో అన్నింటికీ స‌మాధానాలు ఇచ్చేసాడు నాగార్జున‌. ఇప్పుడు నాని కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అ.. సినిమా ప్రెస్ మీట్ లో నాగ్ సినిమాపై ఓపెన్ అయ్యాడు నాని. ఈ సినిమా ఉంటుంద‌ని.. క‌థ బాగా వ‌చ్చింద‌ని చెప్పాడు న్యాచుర‌ల్ స్టార్.
మ‌రోవైపు తాను నానితో క‌లిసి న‌టించ‌బోతున్న‌ట్లు క్లారిటీ ఇచ్చాడు మ‌న్మ‌థుడు. అంతేకాదు  ఈ చిత్ర స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌యింద‌ని చెప్పాడు నాగార్జున‌. వేరే వాళ్ల క‌థ‌ను శ్రీ‌రామ్ ఆదిత్య డెవ‌ల‌ప్ చేస్తున్నాడ‌ని చెప్పాడు ఈ హీరో. త‌న‌కు.. త‌న‌తో పాటు నానికి కూడా ఈ క‌థ  బాగా న‌చ్చింద‌ని చెప్పాడు నాగ్. ఇందులో నాగార్జున మాఫియా డాన్ గా.. నాని డాక్ట‌ర్ గా న‌టించ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌న‌కు నాని అంటే చాలా ఇష్ట‌మ‌ని.. త‌న కామెడీ టైమింగ్ న‌చ్చుతుంద‌ని అందుకే క‌లిసి న‌టిస్తున్నాన‌ని చెప్పాడు నాగార్జున‌. ఈ చిత్రం కోసం తాను కూడా చాలా ఆస‌క్తిగా వేచి చూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు నాగార్జున‌. ఈ మ‌ధ్యే శమంత‌క‌మ‌ణిలో న‌లుగురు హీరోలను ఒకేచోట క‌లిపిన‌ శ్రీ‌రామ్.. ఇప్పుడు నాగార్జున‌-నాని కోసం క‌థ రాస్తున్నాడు. ఈయ‌న చెప్పిన లైన్ న‌చ్చి నాని కూడా ఓకే చెప్పాడు. ఫిబ్ర‌వ‌రి 23న ఈ చిత్రానికి ముహూర్తం పెట్ట‌నున్నారు. ఈ సినిమాలో విక్ర‌మ్ వేధ ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. చూడాలిక‌.. నాగార్జున‌-నాని కాంబినేష‌న్ క‌లిస్తే వ‌చ్చే ఔట్ పుట్ ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here