నాగ్ ను అడ్డంగా ముంచేస్తోన్న వ‌ర్మ‌..

VARMA NAGARJUNA MIDDLE DROP MOVIE
తెలిసి తెలిసి మ‌రీ త‌ప్పు చేసాడు నాగార్జున‌. దాని గురించి ఇప్పుడు బాధ ప‌డినా లాభం లేదు. వ‌ర్మ‌తో సినిమా అన్న‌పుడే అభిమానులు కంగారు ప‌డ్డారు. కానీ మా వ‌ర్మ‌.. మా రామూ.. నేను చెప్పిందంతా చేస్తాడు అంటూ నాగార్జునే వ‌ర్మ‌ను నెత్తిన పెట్టుకున్నాడు. త‌న‌తో సినిమా చేయాలంటే నేను చెప్పిన‌ట్లు వినాల‌నే కండీష‌న్ కూడా పెట్టాడు. చాలా ఏళ్ళ త‌ర్వాత వ‌ర్మ కూడా మారిపోయిన‌ట్లు బాగానే న‌టించాడు. ఆ సినిమాను అనుకున్న‌ట్లుగానే న‌వంబ‌ర్ 20న మొద‌లు పెట్టాడు. తొలి షెడ్యూల్ చెప్పిన టైమ్ కు పూర్తిచేసాడు. కానీ హ‌లో కోసం అలా నాగ్ ప‌క్క‌కెళ్లాడో లేదో త‌న అల‌వాటు బ‌య‌ట పెట్టాడు వ‌ర్మ‌. త‌న‌ చిత్రం పూర్త‌య్యే వ‌ర‌కు మ‌రో సినిమాపై దృష్టి చేయరాద‌ని కండీష‌న్ పెట్టాడు నాగార్జున‌.
ఇది ఒప్పుకుంటేనే సినిమా చేస్తాన‌న్నాడు. ఇది చెప్పింది కూడా ఎవ‌రో కాదు.. స్వ‌యంగా నాగార్జునే. వ‌ర్మ‌కు ఇది చాలా క‌ష్ట‌మైన ప‌ని అని నాగార్జున‌కు తెలుసు. ఇప్పుడు ఇదే నిరూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఓ వైపు నాగ్ సినిమా సెట్స్ పై ఉండ‌గానే సెక్స్ సినిమాలు చేస్తున్నాడు వ‌ర్మ‌. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటాడు.. ఇంకోసారేమో క‌డప వెబ్ సిరీస్ అంటాడు.. ఈ మ‌ధ్య‌లో నాగార్జున బ‌లైపోతున్నాడు పాపం. ఇలా ఓ సినిమా మొద‌లుపెట్టి.. మ‌ధ్య‌లో మ‌రో సినిమా తీసుకొచ్చి ముందు సినిమా గాలికొదిలేసిన సంద‌ర్భాలు బోలెడున్నాయి. సాక్షాత్తు చిరంజీవికే ఈ తిప్ప‌లు త‌ప్ప‌లేదు. అందుకే వ‌ర్మ‌ను ముందుగానే కంట్రోల్లో పెట్టాల‌నుకున్నాడు నాగార్జున‌. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. మ‌రోసారి వ‌ర్మ పాత రూట్ లోనే వెళ్తున్నాడు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. వ‌ర్మ చేస్తోన్న ఈ ప‌నులు నాగార్జున సినిమాను ఎటువైపు వెళ్ల‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here