నాగ్-వ‌ర్మ‌.. వ‌ర్క‌వుట్ అవుతుందా..? 

వ‌ర్మ ఇప్పుడు ఫామ్ లో లేడు.. ఈ మాట కూడా చాలా చిన్న‌ది. ఎందుకంటే ఫామ్ అనే మాటే ఇప్పుడు వ‌ర్మ డిక్ష‌న‌రిలో లేదు. ఈయ‌న నుంచి స‌రైన సినిమా వ‌చ్చి కొన్నేళ్ల‌వుతుంది. ఇప్ప‌టికీ వ‌ర్మ కాన్స‌ట్రేట్ చేస్తే అద్భుతమైన సినిమాలు చేస్తాడు కానీ అదే చేయ‌ట్లేదు క‌దా. వంగ‌వీటి.. వీర ప్ప‌న్ లాంటి సినిమాలు వ‌ర్మ టాలెంట్ ను చూపించాయి. కానీ అంతే శ్ర‌ద్ధగా అన్ని సినిమాలు చేయ‌డు. లేక‌లేక అమితాబ్ లాంటి మెగాస్టార్ ఆఫ‌ర్ ఇస్తే కూడా స‌ర్కార్ 3ని డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్ చేసాడు వ‌ర్మ‌. అలాంటి ద‌ర్శ‌కుడితో ఇప్పుడు నాగార్జున సినిమా చేస్తున్నాడు. స్నేహితుడు క‌దా అని న‌మ్మేసాడు. క‌థ కూడా న‌చ్చేసింది. దాంతో ముందడుగేసాడు. కానీ ఇప్పుడు నాగార్జున అభిమానుల్లో భ‌యం మొద‌లైంది. అస‌లు చెప్పింది చెప్పి న‌ట్లుగా తీస్తాడా లేదంటే త‌మ హీరోకు మ‌రో డిజాస్ట‌ర్ ఇస్తాడా అని భ‌య‌పడుతున్నారు నాగ్ అభిమానులు.
పైగా వీళ్ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన గ‌త రెండు సినిమాలు కూడా ఫ్లాపే. శివ త‌ర్వాత గోవిందా గోవిందా.. అంతం సినిమాలు చేసారు నాగ్-వ‌ర్మ‌. ఈ రెండూ ఫ్లాపే. 24 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్మని న‌మ్మాడు నాగార్జున‌. ప్ర‌స్తుతం ఈ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న సినిమా తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం ముంబైలో రెండో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు నాగార్జున‌. ఆయ‌న 60కి చేరువైనా కూడా ఇప్ప‌టికీ మ‌న్మథుడే. ఈ ఫోటోస్ చూస్తుంటేనే విష‌యం అర్థ‌మైపోతుంది. ముంబైలో ఆయ‌న దిగీ దిగంగానే ఆయ‌న కార్ ను అభిమానులు చుట్టుముట్టారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎక్కువ‌గా తెలిసిన హీరో నాగార్జున ఒక్క‌డే. ఆయ‌న అక్క‌డ కొన్ని సినిమాలు చేసాడు. మార్చ్ 10 వ‌ర‌కు ముంబైలోనే ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో మ‌రో షెడ్యూల్ బాకీ ఉంది. అది పూర్తైతే సినిమా షూటింగ్ పూర్తైపోయిన‌ట్లే. ఎప్రిల్ లో సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here