నాని `కృష్ణార్జున యుద్దం` సాంగ్, లుక్స్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

tremendous response for nani krishnarjuna songs
వ‌రుస విజ‌యాల హీరో నేచ‌ర‌ల్ స్టార్ నాని… ఇప్ప‌టికే ఎనిమిది వ‌రుస విజ‌యాలు అందుకుని..  ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నాని న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.  వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.సినిమా చిత్రీక‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా…
నిర్మాత‌లు మాట్లాడుతూ – “కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. నేచ‌ర‌ల్ స్టార్ నాని ఈ చిత్రంలో కృష్ణ‌, అర్జున్‌గా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌ను విడుద‌ల చేశారు. మాస్ లుక్‌లో కృష్ణ‌, క్లాస్ లుక్‌లోని అర్జున గెట‌ప్‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే `దారి చూడు, దుమ్ము చూడు మామ‌…` అనే సాహిత్యంతో హిప్ హాప్ త‌మిళ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్ప‌టికే సాంగ్‌ ఇప్ప‌టికే మిలియ‌న్ పైగా డిజిట‌ల్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. సినిమా విడుద‌ల‌కు ముందే సినిమాకు వ‌స్తున్న స్పంద‌న చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. త‌ప్ప‌కుండా నానిగారికి ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుందన‌డంలో సందేహం లేదు“ అన్నారు.
నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  హిప్ హాప్ త‌మిళ‌, సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌:  సాహి సురేష్‌, నిర్మాత‌లు :  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది, ద‌ర్శ‌క‌త్వం :  మేర్ల‌పాక గాంధీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here