నాని ల‌వ‌ర్ ఆశ‌ల‌న్నీ గోపీచంద్ పైనే..!

MEHRENE KOUR GOPICHAND

నాని ప్రియురాలు బికినీ వేసిందా..? ఇంత‌కీ ఎవ‌రా బ్యూటీ అనుకుంటున్నారా..? కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా తొలి సినిమా మాత్రం ఎప్ప‌టికీ కొత్త‌గానే ఉంటుంది. ఆ హీరో కూడా అంతే. ఇప్పుడు మ‌నం మాట్లాడుకుంటున్న‌ది కూడా నాని హీరోయిన్ గురించే.. మెహ్రీన్ కౌర్. ఈ పేరు ఆ మ‌ధ్య తెలుగులో బాగా వినిపించింది. రెండు నెల‌ల్లోనే ఐదు సినిమాల‌తో వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లో మ‌హాల‌క్ష్మిగా ఎంతో ప‌ద్ద‌తిగా ఒళ్లంతా క‌ప్పుకుని అచ్చ తెలుగ‌మ్మాయిలా క‌నిపించింది ఈ భామ‌. కానీ పైకి క‌నిపించేంత అమాయ‌కురాలేం కాదు ఈ భామ‌. అవ‌కాశం రావాలే కానీ గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొట్ట‌డానికి కూడా తాను సిద్ధ‌మ‌ని హింట్ ఇచ్చింది మ‌హ్రీన్. ఇప్ప‌టికే జ‌వాన్ లాంటి సినిమాల్లో దాన్ని ఆచ‌ర‌ణలో పెట్టింది కూడా. కానీ ఏం చేస్తాం.. అదృష్ట‌మే క‌లిసిరాలేదు.

ఈ మ‌ధ్య సినిమాల విష‌యంలో కాస్త వెన‌క‌డుగు వేసిన మెహ్రీన్.. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో దూసుకొస్తుంది. ప్ర‌స్తుతం గోపీచంద్ స‌ర‌స‌న పంతం.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో నోటా.. నితిన్-వెంకీ కుడుముల సినిమా.. వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాల్లో హీరోయిన్ గా న‌టిస్తుంది. దాంతో పాటే మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. త‌న‌కు అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి ఏ మాత్రం అభ్యంత‌రం లేదంటూ ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది ఈ భామ.

అంటే ఇప్ప‌ట్నుంచే ఇత‌ర ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు తాను గ్లామ‌ర్ రోల్స్ కు సిద్ధ‌మంటూ ఈ ఫోటోషూట్ తో సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది మెహ్రీన్. ఇక ఇప్పుడు ఈమె ఆశ‌ల‌న్నీ గోపీచంద్ పంతం సినిమాపైనే ఉన్నాయి. ఇది కానీ హిట్టైతే అమ్మ‌డు మ‌ళ్లీ ఫామ్ లోకి రావ‌డం ఖాయం. లేదంటే చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. జులై 5న విడుద‌ల కానుంది పంతం. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్రి తెర‌కెక్కించాడు. మ‌రి చూడాలిక‌.. నాని ప్రియురాలి ఆశ‌ల‌ను గోపీచంద్ ఎంత‌వ‌ర‌కు నెర‌వేరుస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here