నాని వదిలేసాడు.. సుధీర్ ప‌ట్టుకున్నాడు..!

NANI SUDHEER BABU
ఇప్పుడున్న టైమ్ లో సోలో విడుద‌ల తేదీలు దొర‌క‌డం అంటే మాట‌లు కాదు. ఒక్కో డేట్ కోసం ఇద్ద‌రు ముగ్గురు హీరోలు కొట్టుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఓ రిలీజ్ డేట్ ఇప్పుడు సోలోగా దొరికింది సుధీర్ బాబుకు. అది కూడా నాని-నాగార్జున పుణ్య‌మా అని. ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న దేవ‌దాసు సెప్టెంబ‌ర్ 13న వినాయ‌కచ‌వితి కానుక‌గా విడుద‌ల చేయాల‌నుకున్నారు.
దానికి త‌గ్గ‌ట్లు షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. అయితే ఇప్పుడు ఈ చిత్రం అప్పుడు రావ‌డం లేద‌ని అర్థ‌మైపోయింది. దాంతో ఇప్పుడు అదే తేదీని సుధీర్ బాబు తీసుకుంటున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న న‌న్ను దోచుకుందువ‌టే సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయ‌నే కావ‌డం విశేషం. దాంతో సోలో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాడు ఈ హీరో.
ఆర్ఎస్ నాయుడు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. న‌భా న‌టాషా హీరోయిన్ గా న‌టిస్తుంది. మొత్తానికి అక్క‌డ నాని వ‌దిలేసిన తేదీని సుధీర్ ప‌ట్టుకున్నాడు. స‌మ్మోహ‌నం త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో క‌చ్చితంగా ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా టీజ‌ర్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రి చూడాలిక‌.. సుధీర్ ఈ సారి ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here