నాని సినిమాను నాశ‌నం చేసారుగా..

GHAJINIKANTH MOVIE FLOP IN TAMIL
నాని సినిమానా.. నాశ‌నం చేసారా..? ఎవ‌రు చేసారు ఎందుకు చేసారు అనుకుంటున్నారా..? ఆ నాశ‌నం చేసింది ఎవ‌రో కాదు ఆర్య‌.. అవును అర‌వ హీరో ఆర్యే. మ‌రి ఆయ‌న చేసిన ప‌ని అలా ఉంది మ‌రి. ఇప్పుడు ఈయ‌న న‌టించిన గ‌జినికాంత్ విడుద‌లైంది. టైటిల్ విచిత్రంగా ఉంది క‌దా..! ఈ చిత్ర కాన్సెప్ట్ వింటే ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఇందులో హీరో అన్నీ మ‌రిచిపోతుంటాడు.. ఓ ప‌ని చేస్తున్న‌పుడు మ‌రో ప‌ని గాల్లోకి వెళ్లిపోతుంది. అదేంటి.. ఈ క‌థ భ‌లేభ‌లే మ‌గాడివోయ్ ది క‌దా అనుకుంటున్నారా..? అవును.. ఇదే సినిమాను అక్క‌డ రీమేక్ చేసాడు ఆర్య‌. అది కూడా గ‌జినికాంత్ పేరుతో.
గ‌జిని అంటే మ‌రుపుకు బ్రాండ్ అంబాసిడ‌ర్. దాంతో పాటు ర‌జినీకాంత్ ఇమేజ్ ను కూడా వాడుకుంటూ గ‌జినీకాంత్ అని పెట్టేసారు. సంతోష్ జ‌య‌కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 3న అంటే ఈ వార‌మే అక్క‌డ విడుద‌లైంది ఈ చిత్రం. కానీ టాక్ మాత్రం చాలా తేడాగా వ‌చ్చేసింది. తెలుగులో వ‌ర్క‌వుట్ అయిన కామెడీ అక్క‌డ కాలేదు. పైగా సినిమా కాన్సెప్ట్ ను ఇష్ట‌మొచ్చిన‌ట్లు మార్చ‌డంతో అస‌లుకే మోసం వ‌చ్చేసింది. ఇక్క‌డ నాని కెరీర్ ను మార్చేసిన ఈ చిత్రం అక్క‌డ ఆర్య‌కు క‌నీసం హెల్ప్ కూడా అయ్యేలా క‌నిపించ‌డం లేదు. అఖిల్ ఫేమ్ స‌యేషా ఇందులో హీరోయిన్. మొత్తానికి నాని న‌ట‌న‌తో తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన భ‌లేభ‌లే మ‌గాడివోయ్.. క‌న్న‌డ‌, త‌మిళ్ లో మాత్రం ఫ్లాప్ అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here