నాని స‌మ్మ‌ర్ రేస్.. హీరోల‌కు ద‌డ‌.. 

Nani KAY
ఒక‌ప్పుడు నాని సినిమా వ‌స్తుందంటే.. ఆ వ‌స్తే ఏముందిలే.. 10 కోట్ల మార్కెట్టే క‌దా అనుకునేవాళ్లు మిగిలిన హీరోలు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. నానిని లైట్ తీసుకున్నారో.. తామే చీకట్లోకి వెళ్లిపోవ‌డం ఖాయం. ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ రేంజ్ అలా ఉంది మ‌రి. ఒక‌టా రెండా.. ఏకంగా 8 వ‌ర‌స విజ‌యాలు అందుకున్నాడు నాని. అస‌లే హీరో అయినా క‌ల‌లో అయినా ఊహించే రికార్డా ఇది..? ఈ హీరో అదృష్టం ఏ రేంజ్ లో ఉందంటే.. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న ఎంసిఏ కూడా తొలివారంలోనే హిట్ అయ్యేంత‌గా..! ఈ చిత్రం తొలివారంలోనే 30 కోట్ల షేర్ వ‌సూలు చేసి నాని కెరీర్ లో గ‌త రికార్డుల‌న్నింటినీ తుడిచేసింది. ఇంత జోరులో ఉండి కూడా త‌ర్వాతి సినిమా విడుద‌ల తేదీని అప్పుడే క‌న్ఫ‌ర్మ్ చేసాడు నాని. ఈయ‌న ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమాలో న‌టిస్తున్నాడు.
మేర్ల‌పాకగాంధీ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో డ‌బుల్ రోల్ చేస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఒక‌టి తిరుప‌తిలో ఉండే పాత్ర అయితే.. మ‌రోటి పారిస్. కృష్ణ అర్జున్ మ‌ధ్య జ‌రిగే స‌ర‌దా స‌ర‌దా క‌థే కృష్ణార్జున యుద్ధం. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇందులో హీరోయిన్. ఈ చిత్రాన్ని కూడా 23 కోట్ల‌కు దిల్ రాజు కొనేసాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రీ నాటికి పూర్తి కానుంది. ఎప్రిల్ 12న సినిమా విడుద‌ల కానంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. నాని స‌మ్మ‌ర్ రేస్ లో అడుగు పెట్టేస‌రికి మిగిలిన హీరోల్లో తెలియ‌ని ద‌డ మొద‌లైంది. స‌మ్మ‌ర్ లో మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేను.. బ‌న్నీ నా పేరు సూర్య‌.. ర‌జినీకాంత్ 2.0.. నాగార్జున‌-వ‌ర్మ సినిమా.. వెంకీ-తేజ సినిమాలు కూడా రానున్నాయి. వాటితో పాటే నాని కూడా రేస్ లోకి వ‌స్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. కృష్ణార్జున యుద్ధం కానీ హిట్టైతే ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన ఏకైక హీరోగా చ‌రిత్ర సృష్టిస్తాడు నాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here