నాన్నకూచి.. మ‌న‌సును క‌దిలిస్తుంది..

ఓ వైపు హీరోయిన్ గా న‌టిస్తూనే మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌తోనూ బిజీగా ఉంది కొణిదెల వార‌మ్మాయి. మెగా ఫ్యామిలీ వ‌చ్చిన తొలి హీరోయిన్ నిహారికే. ఈ భామ‌కు అభిమానుల నుంచి కూడా మంచి స‌పోర్ట్ ఉంది కానీ విజ‌యాలే ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. దాంతో త‌న‌కు త‌నుగా సొంతంగా ఏదో ట్రై చేయాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ ల‌పై ప‌డింది. ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య‌తో హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది నిహారిక‌. ఇందులో సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించ‌నున్నాడు. ఈ సినిమాకు ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.
అస‌లు కొణిదెల నిహారిక అంటే సినిమాల కంటే ముందు గుర్తింపు తీసుకొచ్చింది షార్ట్ ఫిల్మ్స్. అమ్మాయిగారు అక్క‌డ్నుంచే ప్ర‌తిభ చూపించారు. ఇప్ప‌టికే ముద్ద‌పప్పు ఆవ‌కాయ్ లాంటి స‌క్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ల‌లో కూడా న‌టించింది. ఇలాంటి టైమ్ లో సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ఇంకో వెబ్ సిరీస్ చేస్తుంది నిహారిక‌. దానిపేరు నాన్న‌కూచి. ఇందులో నాగ‌బాబు కూడా న‌టిస్తుండ‌టంతో ఆస‌క్తి పెరిగిపోతుంది. పింక్ ఎలిఫెంట్ అంటే సొంత బ్యానర్ లోనే ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది నిహారిక‌. ప్ర‌నీత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ లోని తొలి ఎపిసోడ్ విడుద‌లైంది. ఇది చూస్తుంటే క‌చ్చితంగా ఏదో కొత్త‌గానే అనిపిస్తుంది. ముద్ద‌పప్పు ఆవ‌కాయ్ తో సూప‌ర్ హిట్ కొట్టిన ఈ మెగా డాట‌ర్.. ఇప్పుడు తండ్రితో క‌లిసి ఏం చేయ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here