నారా లోకేష్ కు ఈ సారి స్పెల్లింగ్ తో వచ్చిన చిక్కులు

Nara Lokesh Makes MOU with Toyota
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టొయోట కంపెనీ తో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి గాను ఒప్పందం కుదృచుకుంది. గురువారం నాడు జరిగిన సమావేశంలో టొయోట కంపెనీ ప్రతినిధుల తో ఐ.టి. మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి లో ఫ్యాక్టరీ నెలకొలిపేందుకు టొయోట కిర్లోస్కర్ మోటార్ వారు ప్రయత్నం చేస్తున్నారు .ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి తద్వారా కాలుష్యాన్ని నియంత్రించే ఆలోచనలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఉంది.
దీనికోసం కొత్తగా ఈవి పాలసీ ప్రవేశ పెట్టాలని చూస్తుంది. ఇది ఇలా ఉండగా, సమావేశ ప్రాంగణం లో కట్టిన బ్యానర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అచ్చు తప్పు రాయడం చర్చనీయాంశమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ ను అంధారా ప్రదేశ్ అని రాయడం తో ప్రతిపక్ష విమర్శలకు తావునిచ్చింది.
ఇప్పటికే అనేక సందర్భాలలో నారా లోకేష్ ఉపన్యాసాల లో తప్పులు దొర్లి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఈ తప్పును ఇంటర్నెట్ లో వ్యంగ్య వీడియోలు పోస్టు లు ద్వారా వైరల్ చేస్తున్నారు కూడా.