నిఖిల్ `కిరాక్ పార్టీ` తొలి పాట‌… విడుద‌ల‌

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న 15వ చిత్రం `కిరాక్ పార్టీ`.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఏ టీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌. శ‌ర‌ణ్‌ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ చిత్రంలోని తొలి పాట `దమ్ దారే` ని ఈరోజు సాయింత్రం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. వ‌న‌మాలి ర‌చించిన ఈ గీతాన్ని హ‌రి చ‌ర‌ణ్ ఆల‌పించారు. అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.  నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లేనీ, మ‌రో ద‌ర్శ‌కుడు చందూ మొండేటి సంభాష‌ణ‌ల‌నూ అందించ‌డం విశేషం.  “ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రీ టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. `ద‌మ్ దారే` పాట యువ‌త‌తో పాటు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన పాట‌ల్ని ఒకొక్క‌టిగా విడుద‌ల చేస్తామ‌“ని చిత్ర‌బృందం తెలిపింది.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌:  కిషోర్ గ‌రికి పాటి,  కో ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌న్ కొప్పిశెట్టి, సంగీతం: అజ‌నీష్ లోక్‌నాథ్‌, క‌ళ‌: అవినాష్‌, కూఎడిటింగ్‌: ఎం.ఆర్ వ‌ర్మ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here