నిత్య‌క‌ళ్యాణం.. ప‌చ్చ‌తోర‌ణం..!

Telugu wedding movies
ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పాల్సి వ‌చ్చింది అనుకుంటున్నారా..? ఇప్పుడు మ‌న ఇండ‌స్ట్రీని చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది మ‌రి. ప్ర‌స్తుతం తెలుగులో పెళ్లి సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎంత‌లా అంటే మ‌రీ వారానికి ఓ సినిమా వ‌చ్చేస్తుందిక్క‌డ‌. జులై 28 నుంచే ఈ ర‌చ్చ మొద‌లైంది. నిహారిక హ్యాపీవెడ్డింగ్ గత‌వారం విడుద‌లైంది. ఈ చిత్రం అనుకున్న విజ‌యం అయితే సాధించ‌లేదు. ఇక ఆగ‌స్ట్ 3న సుశాంత్ చిల‌సౌ వ‌స్తుంది. ఈ చిత్రంపై అంచ‌నాలు అయితే లేవు కానీ ట్రైల‌ర్ మాత్రం ఆక‌ట్టుకుంది.
ఇక ఆగస్ట్ 9న శ్రీ‌నివాస క‌ళ్యాణం వ‌స్తుంది. నితిన్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించాడు. రాశీఖ‌న్నా హీరోయిన్. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అస‌లు పెళ్లంటే ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆ త‌ర్వాత వారం రాబోయే గీత‌గోవిందం కూడా పూర్తిగా పెళ్లి చుట్టూ తిరిగే క‌థే. ఇప్పుడు విడుద‌లైన పాట‌ల్లో కూడా పెళ్లి పాట ఒక‌టి ఉంది. ర‌ష్మిక‌, విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నాడు. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొత్తానికి ప్ర‌తీవారం ఓ పెళ్లి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here