నేల‌టికెట్.. అస్స‌లు అంచ‌నాల్లేవా..?

Nela Ticket
ఇప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉన్నా.. ర‌వితేజ స్టార్ హీరో. ఆయ‌న సినిమా అంటే క‌చ్చితంగా అంచ‌నాలు ఉండాల్సిందే. కొన్నేళ్లుగా హిట్లు ఫ్లాపుల‌తో ప‌ని లేకుండా ర‌వితేజ ఇదే స్టార్ ఇమేజ్ మెయింటేన్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కొత్త హీరోల రాకో.. లేదంటే నిజంగానే ర‌వితేజ ఇమేజ్ త‌గ్గిపోయిందో తెలియ‌దు కానీ ఈ మ‌ధ్య కాలంలో చాలా త‌క్కువ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ర‌వితేజ సినిమా నేల‌టికెట్టే.
ఈ చిత్రంపై నిజంగానే ఇప్పుడు ఆస‌క్తి క‌నిపించ‌ట్లేదు.. అలాగ‌ని అంచ‌నాలు కూడా భారీగా లేవు. ప్ర‌మోష‌న్స్ కూడా నెమ్మ‌దిగానే జ‌రుగుతున్నాయి. అయితే ర‌వితేజ సినిమాల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి లేదు. ఈయ‌న‌కు మాస్ లో సూప‌ర్ ఫాలోయింగ్ ఉంది. పైగా రెండు విజ‌యాల త‌ర్వాత క‌ళ్యాణ్ కృష్ణ చేస్తోన్న సినిమా ఇది.
దాంతో తొలిరోజు టాక్ బాగా వ‌స్తే.. రెండో రోజుకే సీన్ మారిపోవ‌డం ఖాయం. మే 25న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఆ రోజు ఈ ఒక్క సినిమానే విడుద‌ల కానుంది. నా నువ్వే కూడా పోస్ట్ పోన్ కావ‌డంతో సోలో రిలీజ్ గా వ‌స్తుంది నేల‌టికెట్. మ‌రి ఇవ‌న్నీ ఈ చిత్రానికి ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here