న‌య‌న‌తార‌ స్మ‌గ్లింగ్ ఎందుకు చేస్తుంది..? 

Nayanatara First Look From Jai Simha Released
అవును.. ఇప్పుడు ఈమె స్మ‌గ్లింగ్ చేస్తుంది. పోలీసులు కూడా న‌య‌న్ కోసం వెతుకుతున్నారు. న‌య‌న్ అనే పేరు ఇప్పుడు ఓ బ్రాండ్. ఈమె ఓ క‌థ‌కు ఓకే చెప్పిందంటే నిర్మాత నిశ్చింత‌గా నిద్ర‌పోతాడు. అస‌లు హీరోలు రాజ్య‌మేలుతున్న ఈ ఇండ‌స్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాణం పోస్తుంది న‌య‌న‌తార‌.
ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ ఇప్పుడు ఫీమేల్ ఓరియెంటెడ్ క‌థ‌లే కావ‌డం విశేషం. తెలుగులో సైరా.. త‌మిళ్ లో విశ్వాసం  మిన‌హా అన్నీ అలాంటి సినిమాలే. ద‌ర్శ‌కులు కూడా న‌య‌న‌తార‌ను దృష్టిలో పెట్టుకునే కొత్త క‌థ‌లు రాస్తున్నారు. ముఖ్యంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు న‌య‌న్ ను మించిన ఆప్ష‌న్ మ‌రోటి క‌నిపించ‌ట్లేదు. గ‌త రెండు మూడేళ్ల‌లో ఆర‌మ్, డోర‌, నానుం రౌడీధానుం లాంటి సినిమాల‌ను కేవ‌లం త‌న ఇమేజ్ తో న‌డిపించింది న‌య‌న‌తార‌. ఇప్పుడు ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ కుర్ర ద‌ర్శ‌కుల‌తోనే. తాజాగా ఈమె న‌టిస్తున్న కోకో సినిమా ట్రైల‌ర్ కూడా కుమ్మేస్తుందిప్పుడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు చ‌క్రితోలేటీతో క‌లైయుతుర్ కాలం.. జ్ఞాన‌ముత్తుతో ఇమైక్క నోడిగ‌ల్ సినిమాలు చేస్తుంది న‌య‌న‌తార‌. మొత్తానికి ఇప్పుడు న‌య‌న దూకుడు చూస్తుంటే హీరోల‌ను పూర్తిగా దూరం పెట్టేసిన‌ట్లుగా అనిపిస్తుంది.

 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here