పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి అనర్హుడా?

 

పవన్ కళ్యాణ్ మళ్ళి తండ్రయ్యారు. అయన భార్య అన్న లేజ్నేవ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ దంపతులకు ఇదివరకే పోలేనా అనే కూతురు ఉంది. పవన్ కు మాజీ భార్య రేణు దేశాయ్ తో ఇద్దరు పిల్లలు అకిరా నందన్ మరియు ఆధ్య ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజా గా పుట్టిన పిల్లవాడి తో కలిపి పవన్ కు నలుగురు సంతానం. పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ఇదే అదనుగా పవన్ ఎలెక్షన్స్ లో పోటీ చేయడానికి అనర్హుడని ఎద్దేవా చేస్తున్నారు. జన సేన అధినేత తన పార్టీ తరపున 2019 ఎలక్షన్ లో పోటీ చేయడానికి సంసిద్దమవుతున్న విషయం తెలిసిందే. అనంతపూర్ నుండి నిలబడతానని పవన్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు ఎలక్షన్ ల లో పోటీ చేయకూడదనే నిబంధన ఉన్న మాట గుర్తుచేస్తున్నారు ప్రత్యర్థి పార్టీ వారు. ట్విట్టర్ లో తన అభిప్రాయాలు వ్యక్తపరిచే పవన్, తాజా ప్రత్యర్థి అస్త్రాల పై ఎలా స్పందిస్తారు వేచి చూడాలి.