పాప రోజురోజుకీ పెంచేస్తుందిగా..!

ఒక్క‌సారి గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత మ‌డి క‌ట్టుకుని కూర్చుంటానంటే కుద‌ర‌దు. కొన్ని రోజులు అలా లాక్కొని రావొచ్చేమో కానీ ఎప్ప‌టికీ అలాగే ఉంటానంటే మాత్రం కుద‌ర‌దు. ముఖ్యంగా ఇప్పుడున్న కాంపిటీష‌న్ కు హీరోయిన్లు కూడా ముందే ఫిక్స్ అయిపోయి వ‌స్తున్నారు. యాంక‌ర్ అయినా కూడా ఇప్పుడు అందాల ఆర‌బోత త‌ప్ప‌దు. ఈ విష‌యం త్వ‌ర‌గానే అర్థం చేసుకుంది శ్రీ‌ముఖి. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను త‌న యాంక‌రింగ్ తో మ‌తులు పోగొడుతున్న ప‌టాస్ పిల్ల శ్రీ‌ముఖి రోజురోజుకీ బాగానే రెచ్చిపోతుంది. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన శ్రీ‌ముఖి.. ఇప్పుడు చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో బాగానే అందాలు ఆర‌బోస్తుంది. టీవీల్లో రోజూ క‌నిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్ద‌తెర‌పై కూడా మాయ చేయాల‌ని చూస్తుంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో న‌టించినా కూడా శ్రీ‌ముఖికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఈ భామ కూడా అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది. తెలుగ‌మ్మాయి కావ‌డంతో ఆటోమేటిక్ గా మ‌నోళ్లు శ్రీ‌ముఖిని త‌క్కువ‌గా చూస్తున్నారు.
తాను యాంక‌రింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్ లో చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామ‌ర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది. పైగా ఈ మ‌ధ్య ఆడియో ఫంక్ష‌న్స్ లోనూ శ్రీ‌ముఖి కాస్త హ‌ద్దులు దాటేస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా షార్ట్స్ లో అందాల్ని ఆర‌బోసింది శ్రీ‌ముఖి. కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ఈ స్థాయిలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోయిన్ గా న‌టించింది శ్రీ‌ముఖి. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఇందులో అమ్మ‌డు సోకులు అద్భుత‌మే. న‌డుము అందాల‌తో పాటు బాగానే చూపించేసింది శ్రీ‌ముఖి. ఈ చిత్రం త‌ర్వాత క‌చ్చితంగా శ్రీ‌ముఖి అవ‌కాశాల వేట‌లో ముందుండ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. దాంతోపాటు ప్రైవేట్ ఫంక్ష‌న్స్ లోనూ శ్రీ‌ముఖి అందాల ఆర‌బోత హ‌ద్దులు దాటేస్తుంది. ఇదంతా చూస్తుంటే అమ్మాయిగారు అన్నింటికీ రెడీ అన్న‌ట్లు సిగ్న‌ల్స్ ఇచ్చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here