పులితో తిరుగుతున్న దిశాప‌టానీ..!


తెలియ‌నంత వ‌ర‌కే అది సీక్రేట్. ఒక్క‌సారి తెలిసిన త‌ర్వాత అది సీక్రేట్ కాదు. బ‌య‌టప‌డిన త‌ర్వాత ఎంత‌మంది చూస్తే మాకేంటి అన్న‌ట్లుంటారు ఇండ‌స్ట్రీలో. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది ఓ జంట విష‌యంలో. బాలీవుడ్ లో దిశాప‌టాని, టైగ‌ర్ ష్రాఫ్ మ‌ధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ చాలా రోజులుగా వార్త‌లొస్తున్నాయి. ఈ ఇద్ద‌రూ క‌లిసి భాగీ 2లో న‌టించారు. ఆ మ‌ధ్య ఇద్ద‌రూ ప్ర‌త్యేకంగా టూర్ కూడా వెళ్లొచ్చారు.
ఇక ఇప్పుడు మ‌రో సినిమాలో జోడీ క‌ట్టారు కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇన్నాళ్లూ క‌లిసి క‌నిపించ‌డానికి కాస్త ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు విష‌యం ఎలాగూ ప‌బ్లిక్ అయిపోయింది కాబ‌ట్టి వాళ్లు కూడా ప‌బ్లిక్ అయిపోతున్నారు. ప్రేమ దాచినా.. బ‌య‌టికి వ‌చ్చిన‌పుడు ఫోటోలు దాగ‌వు క‌దా.. అదే విష‌యం మ‌రి..! తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్ లో డిన్న‌ర్ డేట్ కు వెళ్లారు ఈ ఇద్ద‌రూ. అక్క‌డ్నుంచి బ‌య‌టికి వ‌స్తున్న ఫోటోస్ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. మొత్తానికి ఈ జోడీ ఇప్పుడు బాలీవుడ్ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిపోయింది. చివ‌రికి ఈ ప్రేమ‌క‌హానీ ఎక్క‌డా ఆగుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here