పూరీకి ఎందుకు అవ‌స‌రం..? 

Puri Jagannadhరెండు మూడు ఫ్లాపులు ఇస్తే స్టార్ డైరెక్ట‌ర్ కాస్తా మామూలు ద‌ర్శ‌కుడు అయిపోతాడా..? ఇక ఆయ‌న్ని స్టార్ హీరోలు ప‌ట్టించుకోరా..? గ‌తంలో ఆయ‌న చేసిన సినిమాలు.. సృష్టించిన సంచ‌ల‌నాలు కూడా మరిచిపోతారా..? ఏమో ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ ను చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఇక్క‌డ హిట్ వ‌చ్చిన ద‌ర్శ‌కుల‌కే చోటు.. ప్లాప్ వ‌స్తే ప‌ట్టించుకోరు.
ఎంత పెద్ద స్టార్ డైరెక్ట‌ర్ అయినా కూడా అవ‌కాశాల కోసం నోరు తెరిచి అడ‌గాల్సిందే..! ఇప్పుడు పూరీకి కూడా ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. మొన్న జ‌రిగిన పంతం ప్రీ రిలీజ్ వేడుక‌లో గోపీచంద్ తో త‌న‌కు ఇంకో సినిమా చేయాల‌ని ఉంద‌ని నోరారా అడిగాడు పూరీ. అస‌లు ఒక‌ప్పుడు ఈయ‌న ఛాన్స్ ఇస్తే చాలు అనుకున్నాడు గోపీచంద్. గోలీమార్ లో పూరీ ఛాన్సిస్తే దేవుడిలా చూసాడు. అలాంటి ద‌ర్శ‌కుడు ఇప్పుడు అదే హీరోను త‌న‌కు ఇంకొక్క అవ‌కాశం ఇవ్వ‌వా అంటూ అడిగిన తీరు చూసి పూరీ అభిమానులు బాగానే హ‌ర్ట్ అయ్యారు. అయినా ఇది ఇండ‌స్ట్రీ..
ఇక్క‌డ అన్నీ ఇలాగే ఉంటాయి. కృత‌జ్ఞత‌కు ఇక్క‌డ చోటుండ‌దు. దాంతో పూరీ కూడా ఇప్పుడు అవ‌కాశాల కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు. మ‌రి ఈయ‌న క‌ష్టాన్ని ఏ హీరో అర్థం చేసుకుంటాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here