పూరీ ఆ రెండు సినిమాలు చేస్తున్న‌ట్లేనా..?


అస‌లే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ డైరెక్ట‌ర్ల‌కు టైమ్ బాగోలేదు. రాజ‌మౌళి.. కొర‌టాల లాంటి ఒక‌రిద్దరు మిన‌హాయిస్తే అంద‌రికీ టైమ్ బ్యాడే ఉంది. ఈ లిస్ట్ లో పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఉన్నాడు. ఈయ‌న‌కు స‌రైన విజ‌యం వ‌చ్చి కూడా చాలా ఏళ్ల‌వుతుంది. ఒక‌ప్పుడు సినిమా ఎలా ఉన్నా డైలాగులు ఉండేవ‌నే ధైర్యంతో వ‌చ్చే వాళ్లు..
కానీ ఇప్పుడు పూరీ సినిమా అంటే వెళ్ల‌డ‌మే వేస్ట్ అంటున్నారు. అంత‌గా దిగ‌జారిపోయింది ఈయ‌న ఇమేజ్. పూరీ ఒక్కో అడుగు వెన‌క్కి వేస్తుంటే.. ఆయ‌న అభిమానులు కూడా త‌గ్గిపోతున్నారు. అస‌లు ఈయ‌న ఎందుకు ఇలా మారిపోయాడో..? ఒక‌ప్పుడు అలాంటి సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడి నుంచి ఇప్పుడిలాంటి సినిమాలు ఎందుకు వ‌స్తున్నాయో తెలియ‌క జుట్టు పీక్కుంటున్నారు ఫ్యాన్స్. ఆకాశ్ తో చేసిన మెహ‌బూబా కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది.
అస‌లు ఇప్పుడు ఏం చేస్తే పూరీ ఈ మ‌త్తులోంచి బ‌య‌ట ప‌డ‌తాడో అర్థం కావ‌డం లేదు అభిమానుల‌కు కూడా. అయితే పూరీ ఊహ‌లు మాత్రం మ‌రోలా ఉన్నాయి. ఈయ‌న ఇప్పుడు మ‌రో రెండు సినిమాల‌కు సై అనేసాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి పూరీ స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.
ఇక దానికి తోడు బాల‌య్య‌కు కూడా పూరీ ఓ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికితోడు ఇప్పుడు కొడుకు ఆకాశ్ హీరోగా మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ డేరింగ్ డైరెక్ట‌ర్. మ‌రి వీటితో అయినా పూరీ బ‌య‌ట‌ప‌డ‌తాడో లేదంటే అప్ప‌టికీ అలాగే ఉంటాడో చూడాలిక‌..!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here