పెళ్లిపై మ‌న‌సు ప‌డిన నితిన్..

అవును.. ఇప్పుడు నితిన్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయ‌న‌కు ఇప్పుడు పెళ్లిపై గాలి మ‌ళ్ళింది. అందుకే వ‌ర‌స‌గా పెళ్లి కాన్సెప్టుల‌తోనే సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. ఒక సినిమాలో ఏమో పెళ్లి చేసుకో అంటున్నాడు.. మ‌రో సినిమాలో మాత్రం పెళ్లంటే వ‌ద్దురా నాన్నా అంటున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి చేస్తుండ‌టం మాత్రం విచిత్ర‌మే. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న శ్రీ‌నివాస క‌ళ్యాణంలో పెళ్లి గొప్ప‌త‌నం చెబుతున్నాడు ఈ కుర్ర హీరో.

స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం త‌ర్వాత ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు నితిన్. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో పెళ్లంటే నోనో అనే కుర్రాడిగా న‌టించ‌బోతున్నాడు నితిన్. ఛ‌లో త‌ర‌హాలోనే ఇది కూడా పూర్తి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ఒకేసారి పెళ్లి చేసుకోవాలి.. చేసుకోవ‌ద్దు అనే క‌థ‌లు చేస్తుండ‌టం నిజంగా విడ్డూర‌మే. పెళ్ళి గురించి ఇంత ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తున్న నితిన్ కు నిజ జీవితంలో పెళ్లి కాక‌పోవ‌డం మ‌రో విచిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here