పేప‌ర్ బాయ్ గా వ‌స్తున్న సంప‌త్ నంది..

సంప‌త్ నంది.. ఈ పేరెక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..? ఫ‌స్ట్ సినిమా చిన్న హీరోతో చేసినా రెండో సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోను డైరెక్ట్ చేసాడు సంపంత్ నంది. ర‌చ్చ‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ ర‌చ్చ చేసాడు. ఈ చిత్రం బాగానే ఆడినా కూడా ఆ త‌ర్వాత ఎందుకో కానీ సంప‌త్ కెరీర్ ఎప్పుడూ ఓ దారిలో న‌డ‌వ‌లేదు. ర‌చ్చ త‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ 2 అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయింది. దాంతో రెండేళ్ల‌కు పైగా ఖాళీగా ఉండి.. బెంగాల్ టైగ‌ర్ చేసాడుజ ఆ సినిమా కూడా యావ‌రేజ్ గానే ఆడింది. పాత రొడ్డ కొట్టుడు క‌థ‌ల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ తిప్పి తీస్తున్నాడ‌నే పేరుండ‌టంతో సంప‌త్ నంది వైపు చూడ్డానికి స్టార్ హీరోలు కాస్త జంకుతున్నారు.

గ‌తేడాది వ‌చ్చిన గౌత‌మ్ నందా కూడా డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఇప్పుడు సంప‌త్ నంది వైపు చూడ్డానికి స్టార్స్ ఎవ‌రూ పెద్ద‌గా సాహ‌సించ‌డం లేదు. ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు లేక‌పోయినా నిర్మాత‌గా మాత్రం మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు సంప‌త్. ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు జ‌య శంక‌ర్ తో పేప‌ర్ బాయ్ సినిమా చేస్తున్నాడు. గాలిప‌టం త‌ర్వాత త‌న ప్రొడ‌క్ష‌న్ లో మ‌రో సినిమా చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ జూన్ 20న విడుద‌ల కానుంది. నిర్మాత‌గా బిజీగా ఉంటూనే.. ద‌ర్శ‌కుడిగానూ స‌త్తా చూపించ‌డానికి ట్రై చేస్తున్నాడు సంప‌త్ నంది. ప్ర‌స్తుతం ఈయ‌న చూపులు బ‌న్నీపై ప‌డ్డాయ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే అల్లు వార‌బ్బాయికి సంప‌త్ నంది ఓ క‌థ చెప్పాడ‌ని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మొత్తానికి చూడాలిక‌.. ద‌ర్శ‌కుడిగా వ‌చ్చి నిర్మాత‌గా మారిన సంప‌త్.. ఫ్యూచ‌ర్ లో ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here