పేప‌ర్ బాయ్ టీజ‌ర్.. క్లీన్ అండ్ నీట్..!

సంప‌త్ నంది.. ఈ పేరెక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..? ఫ‌స్ట్ సినిమా చిన్న హీరోతో చేసినా రెండో సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోను డైరెక్ట్ చేసాడు సంపంత్ నంది. ర‌చ్చ‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ ర‌చ్చ చేసాడు. ఈ చిత్రం బాగానే ఆడినా కూడా ఆ త‌ర్వాత ఎందుకో కానీ సంప‌త్ కెరీర్ ఎప్పుడూ ఓ దారిలో న‌డ‌వ‌లేదు.
బెంగాల్ టైగ‌ర్ యావ‌రేజ్ గానే ఆడ‌టం.. గౌత‌మ్ నందా డిజాస్ట‌ర్ కావ‌డంతో సంప‌త్ కెరీర్ ఎటెళ్తుందో తెలియ‌డం లేదు. డైరెక్ష‌న్ కాకుండా ఇప్పుడు మ‌రోసారి నిర్మాత‌గా మారాడు. త‌నే క‌థ రాసి.. కొత్త ద‌ర్శ‌కుడు జ‌య శంక‌ర్ తో పేప‌ర్ బాయ్ సినిమా చేస్తున్నాడు. గాలిప‌టం త‌ర్వాత త‌న ప్రొడ‌క్ష‌న్ లో మ‌రో సినిమా చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైందిప్పుడు. వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడు సంతోష్ ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. టీజ‌ర్ చూస్తుంటేనే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది. ఐదేళ్లుగా రోజూ త‌న‌ను చూడ‌టం కోసం పేప‌ర్ బాయ్ లా మారిపోయాను అంటూ త‌న ప్రేమ‌ను చూపించాడు ఆ ప్రేమికుడు.
ఇక బి టెక్ చేసి పేప‌ర్ వేస్తున్నావా అంటే అది బ‌త‌క‌టం కోసం.. ఇది ఫ్యూచ‌ర్ కోసం అంటూ రాసిన డైలాగ్ ను బ‌ట్టి సినిమాలో యూత్ కు మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో సంప‌త్ ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here