పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లొ “ఒక్కటే లైఫ్ “

okate life completes post production
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత
 ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా
లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం” ఒకటే లైఫ్” .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా  నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా
దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ..  టైటిల్ చూడగానె సినిమా కాన్సెప్ట్ ఎంటనేది అందరికీ అర్దమవుతుంది.  టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు  ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతొన్న చిత్రమిది. సినిమాలోని ప్రతి పాత్రకు ఓ పర్పస్ ఉంటుంది.
సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు.మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకుల కు మా సినిమా కలిగిస్తుందన్నారు.
నిర్మాత నారయణ్ రామ్ మాట్లాడుతూ.. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా టీమ్ అందరికీ మంచి పేరును తీసుకువచ్చె చిత్రంగా నిలుస్తుంది. అతి త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు
జితన్ రమేష్, శృతియుగల్, సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి ,శ్యామ్ ,దిశ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్ , కూర్పు: నందమూరి హరి, ఆర్ట్: విజయ్ కృష్ణ , పబ్లిసిటీ : సాయి సతీష్, కెమెరా: వై.గిరి, రచన: సతీష్ బండోజీ , దర్శకత్వం : ఎం.వెంకట్, నిర్మాత : నారాయణ్ రామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here