ఇండియా నుంచి వెళ్లింది కానీ ఒక్కసారి హాలీవుడ్ గాలి సోకిన తర్వాత మన దేశాన్ని పూర్తిగా మరిచిపోయింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ కోసం మారిపోయింది. ఇంగ్లీష్ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తొలి సినిమా బేవాచ్ ఫ్లాపైనా కూడా ప్రియాంకకు అక్కడ్నుంచి ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఆ మధ్య క్వాంటికో అనే టెలివిజన్ షోతో హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది ప్రియాంక. ఈ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆస్కార్ కు హోస్టింగ్ కూడా చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఈ భామకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిసెంబర్ 19న ముంబైలో జీ టీవీ అవార్డుల ఈవెంట్ జరగబోతుంది. అందులో ఐదు నిమిషాల డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి 5 కోట్లు తీసుకుంటుంది ప్రియాంక చోప్రా.
అంటే నిమిషానికి ఒక కోటి రూపాయలు ఛార్జ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రేజ్ చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. హాలీవుడ్ లోనూ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది ప్రియాంక చోప్రా. వీటిలో ఒకటి ఈజ్ ఇన్ట్ ఇట్ రొమాంటిక్.. మరోటి ఏ కిడ్ లైక్ జాక్.. ఈ రెండు సినిమాలు రొమాంటిక్ జోనరే. పైగా ఈ మధ్యే విడుదలైన మేకింగ్ వీడియో ఒకటి పిచ్చెక్కిస్తుంది. హాట్ క్లీవేజ్ షోతో మతులు పోగొడుతుంది ప్రియాంక చోప్రా. పూర్తిగా హాలీవుడ్ హీరోయిన్ లా మారిపోయిన ప్రియాంక.. ఇండియా అనేది ఒకటి ఉందని.. తను వచ్చింది అక్కడ్నుంచే అని మరిచిపోయింది. లేకపోతే మరేంటి.. హాలీవుడ్ హీరోయిన్లు కూడా కుళ్ళుకునేలా ఏందీ ఎక్స్ పోజింగ్..? ఇప్పుడు విడుదలైన ఫోటోషూట్లలో కూడా ప్రియాంక చోప్రా జోరు చూసి కళ్లు తేలేయడం తప్ప ఇంకేం చేయలేం..! మొత్తానికి ఇప్పుడు ప్రియాంక చోప్రా అంటే కేరాఫ్ బాలీవుడ్ కాదు హాలీవుడ్ అంతే..!