ప్రివ్యూ: శ్రీ‌నివాస క‌ళ్యాణం

SRINIVASA KALYANAM PREVIEW
లై.. చ‌ల్ మోహ‌న్ రంగా లాంటి వ‌ర‌స ఫ్లాపుల త‌ర్వాత నితిన్ న‌టిస్తున్న సినిమా శ్రీ‌నివాస క‌ళ్యాణం. ఇక దిల్ రాజు కూడా ఈ మ‌ధ్యే ల‌వ‌ర్ తో ఓ షాక్ తిన్నాడు. ఇప్పుడు ఈ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా శ్రీ‌నివాస క‌ళ్యాణం. నితిన్ హీరోగా న‌టించిన దిల్ సినిమాతోనే రాజుగారి ప్ర‌యాణం మొద‌లైంది. అందుకే దిల్ రాజు అయ్యారు. ఆ త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణంతో నితిన్ ను క‌లుపుకున్నాడు రాజు. ఈ చిత్రం మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల కానుంది. ఆగ‌స్ట్ 9న దాదాపు 700 థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుంది ఈ చిత్రం.
ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్స్.. ట్రైల‌ర్స్.. పాట‌లు అన్నీ సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌మంత ఎత్తుకు చేర్చేసాయి. ఇప్పుడు బిజినెస్ కూడా ఇలాగే జ‌రిగింది. ఒక‌టి రెండు కాదు.. నితిన్ మార్కెట్ తో ప‌నిలేకుండా 27 కోట్ల‌కు అమ్మేసాడు దిల్ రాజు.
అటు ఓవ‌ర్సీస్ లో కూడా ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. అక్క‌డ‌ హక్కుల్ని ప్ర‌ముఖ సంస్థ 3 కోట్లకు కొన్న‌ట్లు తెలుస్తుంది. నితిన్ లాంటి హీరోకు ఇది చాలా ఎక్కువ‌. ఎందుకంటే ఈయ‌న కెరీర్ లో అ..ఆ మాత్ర‌మే అక్క‌డ అద్భుతాలు చేసింది. అది కూడా త్రివిక్ర‌మ్ క్రేజ్ తో.
కానీ ఇప్పుడు అ..ఆ తర్వాత అంత భారీ రేట్ పెట్టి తీసుకుంటున్న సినిమా శ్రీ‌నివాస క‌ళ్యాణ‌మే. లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమాలు డిజాస్ట‌ర్స్ గా నిలిచినా స‌తీష్ వేగేశ్న‌.. దిల్ రాజు బ్రాండ్ తో శ్రీ‌నివాస క‌ళ్యాణం అక్క‌డ కూడా భారీ రేట్ కు అమ్ముడైంది. క‌చ్చితంగా ఈ చిత్రం విదేశాల్లో అద‌ర‌గొడుతుంద‌ని న‌మ్ముతున్నాడు దిల్ రాజు. 3 కోట్ల‌ను వెన‌క్కి తీసుకురావ‌డం అంటే మాట‌లు కాదు.. క‌చ్చితంగా ఈ చిత్రంతో మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేస్తే కానీ నితిన్ సినిమా సేఫ్ కాన‌ట్లే. మొత్తానికి 30 కోట్ల‌కు పైగా వ‌స్తే కానీ శ్రీ‌నివాస క‌ళ్యాణం హిట్ అనిపించుకోదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here