ప్ర‌కాశ్ బాబు.. ఇక్క‌డే మీరేం చేయ‌లేదు..!

ప్ర‌కాశ్ అంటే ప్ర‌కాశ్ రాజ్ కాదు.. కేఎస్ ప్ర‌కాశ్ రావు.. స‌న్నాఫ్ రాఘ‌వేంద్ర‌రావ్. తెలుగులో అన‌గ‌న‌గా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి సినిమాలు చేసిన అనుభ‌వం ఈ ద‌ర్శ‌కుడి సొంతం. తండ్రి మాదిరే స్టార్ డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్నాడు కానీ కాలం మాత్రం క‌లిసి రావ‌డం లేదు ఈ ద‌ర్శ‌కుడికి. చేసిన రెండు సినిమాలు డిజాస్ట‌ర్లు అయిపోయాయి. భారీ బ‌డ్జెట్ తో భారీ క్యాస్టింగ్ తోనే ఈ సినిమాలు వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌లేక చ‌తికిల ప‌డ్డాయి. ఇప్పుడు మూడో ప్ర‌య‌త్నంగా మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌కాశ్. అయితే ఈ సారి తెలుగు ప్రేక్ష‌కుల కోసం కాదు.. ఏకంగా హిందీ లోనే త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు ప్ర‌కాశ్ కోవెల‌మూడి. మెంట‌ల్ హై క్యా అంటూ కంగ‌న ర‌నౌత్ లాంటి స్టార్ హీరోయిన్ తో సినిమా చేసే అవ‌కాశం అందుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఇందులో బుద్ధిహీన‌త ఉన్న అమ్మాయి పాత్ర‌లో న‌టించ‌బోతుంది కంగ‌న ర‌నౌత్. బాలీవుడ్ లో ఇప్పుడు కంగ‌న రేంజ్ మామూలుగా లేదు. స్టార్ హీరోల స్థాయిలో ఈమె సినిమాలు వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్ర‌కాశ్ ఆమెతో సినిమా వ‌ర్క‌వుట్ చేసాడు. మ‌రి ఈ మెంట‌ల్ హై క్యా అయినా ప్ర‌కాశ్ కోవెల‌మూడి ఆశ ల‌ను నిల‌బెడుతుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here