ప్ర‌భాస్ కోసం యూర‌ప్ వ‌స్తుంది..!

PRABHAS EUROPE RADHAKRISHNA

అవ‌స‌రం ఉంటే యూర‌ప్ కు మ‌నం వెళ్లాలి. కానీ ప్ర‌భాస్ కోసం ఇప్పుడు యూర‌పే ఇక్క‌డికి వ‌స్తుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నెల‌ల త‌ర‌బ‌డి అక్క‌డే షూటింగ్ చేయాల్సి రావ‌డంతో మ‌నం అక్క‌డికి వెళ్లేకంటే.. ఆ దేశాన్నే ఇక్క‌డికి తీసుకొస్తే బాగుంటుంది క‌దా అని ఆలోచిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ ప్లానింగ్ అంతా సాహో కోసం మాత్రం కాదు. ఆ త‌ర్వాత సినిమా కోసం. జిల్ ఫేమ్ రాదాకృష్ణ‌తో సినిమా చేయ‌డానికి ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఓకే చెప్పాడు.

ఈ చిత్ర ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్ర‌స్తుతం వేగంగా జ‌రుగుతుంది. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది సినిమా ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. సాహో సెట్స్ పై ఉండ‌గానే రాధాకృష్ణ సినిమాను కూడా పూర్తి చేయాల‌నేది ఈయ‌న ప్లాన్. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 2019లో రెండు సినిమాలతో రావాల‌ని చూస్తు న్నాడు ప్ర‌భాస్. రాధాకృష్ణ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. అక్క‌డే దాదాపు 70 శాతం షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు.

దాంతో ఆ దేశ‌పు సెట్ ను హైద‌రాబాద్ లో వేయాల‌ని చూస్తున్నారు. యూర‌ప్ ను త‌ల‌పించేలా భారీ సెట్టింగులు.. రోడ్లు.. క‌ట్ట‌డాలు ఇక్క‌డే వేయ‌బోతున్నారు. 6 కోట్ల‌కు పైగా భారీ ఖ‌ర్చుతో ఈ సెట్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. దీనికోసం హాలీవుడ్ నిపుణులు కూడా ప‌ని చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. జిల్ ఫ్లాప్ అయినా స్టైలిష్ మేకింగ్ తో ఆక‌ట్టుకున్నాడు రాధా. మ‌రి ఇప్పుడు ప్ర‌భాస్ ఇచ్చిన ఛాన్స్ అయినా స‌రిగ్గా వాడుకుంటాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here