ప్ర‌భాస్ పై అనుష్క సంచ‌ల‌న కమెంట్స్..

ANUSHKA PRABHAS PELLI NO MARRAIGE
ప్ర‌భాస్-అనుష్క‌.. ఈ రెండు పేర్లు ప‌క్క‌ప‌క్క‌నే బెట్టి చ‌దివితే తెలియ‌ని వైబ్రేష‌న్ ఒక‌టి వ‌స్తుంది. ఎందుకో తెలియ‌దు కానీ ఈ ఇద్ద‌రిపై ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ వార్త‌లు వినిపిస్తూనే ఉంటాయి. ఇద్ద‌రికి ఎఫైర్ ఉంద‌నే టాక్ కూడా చాలా కాలంగా ఇండ‌స్ట్రీలో వ‌స్తుంది. ఈ విష‌యంపై ఇటు అనుష్క కానీ.. అటు ప్ర‌భాస్ కానీ ఎప్పుడూ నోరు విప్ప‌లేదు. అలాగ‌ని ఓపెన్ కూడా కాలేదు. కానీ ఇన్నాళ్ల‌కు అనుష్క మాత్రం ఈ విష‌యంపై మాట్లాడింది. తాజాగా భాగ‌మ‌తి త‌మిళ ఆడియో వేడుక‌లో మాట్లాడుతూ ప్ర‌భాస్ ను అన్న‌య్య అని పిల‌వ‌డం బాగుండ‌ద‌ని.. త‌న‌కు మంచి మిత్రుడు ప్ర‌భాస్ అని చెప్పింది అనుష్క‌. త‌న‌కు ప్ర‌భాస్ కు పెళ్లి అనేది మాత్రం చాలా త‌ప్పు అని చెప్పింది జేజ‌మ్మ‌.
అస‌లే ఈ మ‌ధ్య కాలంలో సినిమా వాళ్ల పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. ప్రేమించుకున్న వాళ్లంతా సిన్సియ‌ర్ పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో జంట పెళ్లి ముచ్చట్లు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అస‌లు ఈ రోజుల్లో ఓ అమ్మాయికి 30 ఏళ్ల వ‌ర‌కు పెళ్లి కాలేదంటేనే ఆశ్చ‌ర్యం.. అదే అమ్మాయి హీరోయిన్ అయితే ఓకే.. ఏముందిలే 30 దాటిన త‌ర్వాత చేసుకుంటుంది అనుకుంటారు. కానీ హీరోయిన్లు కూడా 30 దాటిన త‌ర్వాత కానీ పెళ్లి చేసుకోవ‌డం లేదు. ఈ లిస్ట్ లో మూడు ప‌దులు దాటేసి అనుష్క ఏడేళ్లైపోయింది. ఇక ప్ర‌భాస్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఇద్ద‌రూ 30 దాటి చాలా ఏళ్లైపోయింది. దాంతో సాధారణంగానే ఇద్ద‌రి పెళ్ళిపై ఎప్పుడూ కావాల్సిన‌న్ని రూమ‌ర్లు వ‌స్తూనే ఉంటాయి.
ప్ర‌భాస్ వ‌య‌సు 38 ఏళ్లు.. అనుష్క వ‌య‌సు 36 ఏళ్లు.. ఇద్ద‌రూ పెళ్లికి దూరంగానే ఉన్నారు. మ‌గాళ్ళ ముచ్చ‌టేమో గానీ.. అమ్మాయి వ‌యసు 30 దాటితే ఇంకా పెళ్లి కాలేదా అంటారు. కానీ అనుష్క మాత్రం 36 వ‌చ్చినా.. అప్పుడే నాకు పెళ్ళేంటి అంటుంది. ఇక ప్ర‌భాస్ అయితే పెళ్ల‌నే ఒక మాట ఉంద‌నే విష‌య‌మే మ‌రిచిపోయాడు. ఇన్నాళ్లూ అంటే బాహుబ‌లి ఉంద‌ని చెప్పి త‌ప్పించుకున్నారు. కానీ ఇప్పుడు బాహుబ‌లి కూడా పూర్త‌యింది. కానీ ఇప్పుడు సాహో ఉందంటున్నాడు. ఇప్పుడు హైద‌రాబాద్ లోనే సాహో షూటింగ్ లో ఉన్నాడు ప్ర‌భాస్. అనుష్క భాగ‌మ‌తి ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉంది.
పైగా ప్ర‌భాస్ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. మ‌రోవైపు కృష్ణంరాజు మాత్రం ప్ర‌భాస్ పెళ్లి ఈ ఏడాదే ఉంటుంద‌ని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక అనుష్క సంగ‌తి మరోలా ఉంది. ఈ భామ త‌న పెళ్లి విష‌యం పూర్తిగా ఇంట్లో వాళ్ళ‌కు వ‌దిలేసింది. మ‌రో వైపు వ‌ర‌సగా సినిమాలు కూడా చేస్తూ పోతుంది జేజ‌మ్మ‌. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య ఇండ‌స్ట్రీలోని ఓ ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ క‌మ్ నిర్మాత‌తో అనుష్క పెళ్లి అంటూ రూమ‌ర్లు వ‌చ్చాయి. మ‌రోవైపు త‌న‌కు పెళ్లి గురించి ఆలోచించే టైమ్ కూడా లేదంటుంది జేజ‌మ్మ‌. ప్ర‌స్తుతం భాగ‌మ‌తి సినిమాతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడేమో ప్ర‌భాస్, అనుష్క‌నే పెళ్లి చేసుకుంటున్నార‌నే వార్త‌లొస్తున్నాయి. మ‌రి ఈ ప్ర‌నుష్క ప‌రిణ‌య క‌థ‌కు వాళ్లెప్పుడు ఫుల్ స్టాప్ పెడ‌తారో చూడాలి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here