ప‌వ‌న్ దారిలో వెళ్తున్న రేణు..

RENU DESAI
ఉన్న‌ట్లుండి యు ట‌ర్న్ తీసుకుంది రేణుదేశాయ్. ఇన్నాళ్లూ తెలుగు ఇండ‌స్ట్రీని పెద్ద‌గా ప‌ట్టించుకోని ఈమె ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ దారిలో న‌డ‌వ డానికి సిద్ధ‌మైంది. ప‌వ‌న్ తో విడిపోయిన త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీ గురించి అస‌లు ప‌ట్టించుకోలేదు ప‌వ‌న్ మాజీ భార్య‌. అయితే ఇప్పుడు మాత్రం కోరి మ‌రి మ‌ళ్లీ తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది. అయితే ఈ సారి మాత్రం న‌టిగా కాకుండా ద‌ర్శ‌కురాలిగా ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది.
ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధం చేసుకుంది రేణు. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌ను తానే సొంతం నిర్మించ‌బోతుంది కూడా. ప‌వ‌న్ కూడా ద‌ర్శ‌కుడిగా మారి అప్ప‌ట్లో జానీ సినిమా చేసాడు. ఇప్పుడు రేణు కూడా మెగాఫోన్ ప‌డుతుంది. అయితే ఇప్ప‌టికే మ‌రాఠీలో ఇష్క్ వాలా ల‌వ్ తో ద‌ర్శ‌కురాలిగా మారి ఓకే అనిపించుకుంది రేణుదేశాయ్. ఇప్పుడు తెలుగులో సినిమా చేయ‌బోతుంది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు చెప్తానంటుంది. న‌టిగా రెండు సినిమాల ప్ర‌యాణంతోనే ఆపేసిన రేణు.. ద‌ర్శ‌కురాలిగా అయినా తెలుగులో సత్తా చూపిస్తుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here