ప‌వ‌న్ ధాటిని బ‌న్నీ త‌ట్టుకుంటాడా..?

‘Naa Peru Surya’ Shooting Update
ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ గురించి లెక్కేయ‌డం అంటే ఆకాశానికి నిచ్చెన వేయ‌డ‌మే. రెండూ జ‌ర‌గ‌వు. ఎందుకంటే ఆ రేంజ్ లో ప‌వ‌ర్ స్టార్ క్రేజ్ ఉంది మ‌రి. ఆయ‌న నుంచి అద్భుత‌మైన సినిమాలేవీ కోరుకోవ‌ట్లేదు అభిమానులు.. జ‌స్ట్ యావ‌రేజ్ సినిమాలు అడుగుతున్నారంతే. అజ్ఞాత‌వాసి ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ ఇప్పుడు దానిపై ఉన్న క్రేజ్ చూస్తుంటే మాత్రం సినిమా క‌చ్చితంగా ఓపెనింగ్ రికార్డులేవీ మిగిల్చేలా క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒక్క టీజ‌ర్ మాత్ర‌మే విడుద‌లైంది. ఇదే సంచ‌ల‌నం సృష్టించింది. ఇక ఇప్పుడు జ‌న‌వ‌రి 1న పాట విడుద‌ల కానుంది. పైగా ఈ పాట‌ను ప‌వ‌న్ పాడాడు. కొడ‌కా కోటేశ్వ‌ర‌రావ్ అంటూ సాగే ఈ పాట‌ను ప‌వ‌న్ స్వ‌యంగా పాడాడు. ఇక జ‌న‌వ‌రి 1నే బ‌న్నీ న‌టిస్తోన్న నా పేరు సూర్య టీజ‌ర్ విడుదల కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల కాలేదు. అందుకే దీనికి టీజ‌ర్ అని పేరు పెట్ట‌కుండా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అని వ‌దులుతున్నారు. కొడ‌కా కోటేశ్వ‌ర‌రావ్ మాయ‌లో ఉన్న మెగా అభిమానుల‌కు బ‌న్నీ నా పేరు సూర్య డ‌బుల్ డోస్ ఇవ్వ‌నుంది. కానీ ప‌వ‌న్ ని త‌ట్టుకోవాలంటే మాత్రం నా పేరు సూర్య నా యిల్లు ఇండియా టీజ‌ర్ మాత్రం మ‌రో రేంజ్ లో ఉండాలి. లేదంటే బ‌న్నీని ప‌వ‌న్ క‌వ‌ర్ చేయ‌డం ఖాయం. చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌నుందో.. మెగా ట్రీట్ ప్ల‌స్ వార్ జ‌న‌వ‌రి 1న తేల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here